సూపర్ స్టార్ తో ఐదవ సారి జత కట్టబోతుంది

Update: 2022-08-08 15:30 GMT
తమిళ్ సూపర్ స్టార్ విజయ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఉన్నాడు. సక్సెస్ ఫ్లాప్ ల గురించి విజయ్‌ అస్సలు పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు భారీ బ్లాక్ బస్టర్ లతో పాటు అప్పుడప్పుడు ప్లాప్ లు కూడా పడుతున్నాయి. హీరోగా ఆయన త్వరలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా ను చేయబోతున్న విషయం తెల్సిందే.

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో మాస్టర్ సినిమా వచ్చింది. ఆ సినిమా కరోనా సమయంలో కూడా మంచి వసూళ్లను రాబట్టి హిట్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ విక్రమ్‌ సినిమా ను కమల్‌ హాసన్‌ తో తెరకెక్కించి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఇండస్ట్రీ హిట్‌ ను కూడా దక్కించుకున్నాడు. మళ్లీ విజయ్ తో సినిమా అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి.

ప్రస్తుతం విజయ్‌ చేస్తున్న సినిమా పూర్తి అయిన వెంటనే లోకేష్ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.

ఇప్పటికే ఆ సినిమాలో ఒక హీరోయిన్‌ గా సమంత ను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరో హీరోయిన్‌ పాత్ర కూడా కథలో అత్యంత కీలకంగా చెబుతున్నారు. అందుకే ఆ పాత్రకు గాను త్రిష తో చర్చలు జరుపుతున్నారట.

త్రిష కెరీర్ లో సూపర్‌ హిట్‌ చిత్రాల జాబితాలో విజయ్‌ తో నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో నాలుగు సినిమాలు వచ్చాయి. కనుక మరోసారి వీరిద్దరు జత కడితే చూడముచ్చటగా ఉంటుందని చాలా కాలంగా తమిళ తంబీలు భావిస్తున్నారు. ఇన్నాళ్లకు విజయ్ తో త్రిష మళ్లీ జత కట్టే అవకాశం దక్కించుకుంది అంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

14 ఏళ్ల క్రితం విజయ్ నటించి కురివి సినిమాలో త్రిష హీరోయిన్‌ గా నటించింది. మళ్లీ అప్పటి నుండి ఇప్పటి వరకు త్రిష మరియు విజయ్ లు స్క్రీన్‌ షేర్‌ చేసుకోలేదు. ఈ ఏడాది వీరిద్దరి కలయికలో సినిమా మొదలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్రిష మరియు విజయ్ సినిమా వార్తలపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News