విజయ్ వారసుడు.. మైండ్ బ్లోయింగ్ బిజినెస్

Update: 2022-10-30 07:15 GMT
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇటీవల కాలంలో వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా అతను మార్కెట్ ను పెంచుకుంటూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతంలో ఎక్కువగా రజనీకాంత్ సినిమాలు భారీ స్థాయిలో బిజినెస్ క్రియేట్ చేసేవి. కానీ ఇప్పుడు మాత్రం విజయ్ సినిమాలు డామినేట్ చేస్తున్నాయి.

కోలీవుడ్ చిత్రపరిశ్రమలోనే కాకుండా ఇప్పుడు అతను సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో కూడా టాప్ హీరోలలో ఒకడిగా చోటు సంపాదించుకుంటూ ఉండటం విశేషం. హిందీలో మార్కెట్ లేకపోయినప్పటికీ కూడా సోలోగా అతను కేవలం సౌత్ ఇండస్ట్రీలోని 300 కోట్లకు పైగా మార్కెట్ ను అందుకుంటున్నాడు. అయితే 2023 సంక్రాంతికి రాబోయే వారసుడు సినిమా కూడా దాదాపు అదే తరహాలో రికార్డు స్థాయిలో బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే నిర్మాత దిల్ రాజు టేబుల్ ప్రాఫిట్ వచ్చే విధంగా డీల్స్ మాట్లాడుకున్నట్లు సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఇప్పటివరకు కనీసం ఒక టీజర్ కూడా విడుదల కాలేదు. ఆయనప్పటికీ కూడా అంచనాలు ఆకాశాన్ని దాటేస్తున్నాయి అయితే ఈ సినిమా కోసం విజయ్ దాదాపు 90 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక దిల్ రాజు ఈ సినిమాపై మొత్తంగా 250 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా విజయ్ కు కూడా ఇదే చాలా పెద్ద బడ్జెట్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ డీల్స్ అయితే ఇంకా క్లోజ్ కాలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా నాన్ థియేట్రికల్ గా అలాగే థియేట్రికల్ గా చూసుకుంటే ఈ సినిమా 280 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక తెలుగులో కూడా డీల్స్ క్లోజ్ అయితే ఈ లెక్క 300 కోట్లకు చేరువయే ఛాన్స్ ఉంది. ఈ విధంగా వారసుడు సినిమాతో విజయ్ సౌత్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News