కోలీవుడ్ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ కు టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ ఉంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రతి సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం విజయ్ ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
అదే `వారిసు(తెలుగులో వారసుడు)`. వంశీ పైడిపల్లికి ఇది 6వ చిత్రం కాగా.. విజయ్ కు 66వ ప్రాజెక్ట్ కావడం విశేషం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంటే.. ప్రభు, శరత్ కుమార్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, ఖుష్బూ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే మొదట వారసుడు విజయ్ తెలుగులో చేస్తున్న డైరెక్ట్ చిత్రమని అన్నారు. ఆ తర్వాత బై లింగ్యువల్ మూవీ అన్నారు. తాజాగా వంశీ పైడిపల్లి ఇది పక్కా తమిళ చిత్రం అంటూ క్లారిటీ ఇచ్చారు. తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తామని వెల్లడించారు.
కానీ తెలుగులో ఈ చిత్రానికి ఇప్పటికైతే ఎలాంటి బజ్ నెలకొనలేదు. పైగా సంక్రాంతి బరిలో ప్రభాస్ `ఆదిపురుష్`, చిరంజీవి `వాల్తేరు వీరయ్య`, బాలకృష్ణ `వీరసింహారెడ్డి` లాంటి భారీ సినిమాలు ఉండడంతో విజయ్ `వారసుడు` వైపు ఎవరు కన్నెత్తి కూడా చూడటం లేదు. నిజానికి విజయ్ సినిమా వస్తోందంటే తమిళంతో పాటు తెలుగులోనూ మంచి హైప్ ఏర్పడేది.
అయితే వారసుడు విషయంలో అందుకు భిన్నంగా సాగుతోంది. దానికి తోడు వారసుడు సినిమా పోస్టర్స్, ప్రోమోలు చూస్తుంటే వంశీ పైడిపల్లి గత చిత్రం `మహర్షి`కి మరో వెర్షన్ మాదిరి కనిపిస్తోందని టాక్ నడుస్తోంది. దీంతో విజయ్ సినిమాకు తెలుగులో జీరో బజ్ నెలకొంది. ఇక కోలీవుడ్ లో ఈ సినిమాకు బాగానే క్రేజ్ ఏర్పడింది.
కానీ `వారసుడు`కు పోటీగా అజిత్ కుమార్ నటించిన `తునివు` దిగబోతోంది. వలిమై డైరెక్టర్ హెచ్.వినోత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ భారీ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ లెక్కన విజయ్ `వారసుడు` పొంగల్ వార్‌లో దిగితే.. టాక్ ఎంత బాగున్నా తమిళంతో పాటు తెలుగులోనూ బాక్సాఫీస్ వద్ద హెవీ క్లాషెస్ వచ్చే అవకాశాలు ఎంతైనా ఉంటాయి. ఒకవేళ పొరపాటున టాక్ తేడాగా వస్తే ఇక అంతే సంగతలు. ఈ నేపథ్యంలోనే వారసుడు రాంగ్ టైం లో దిగుతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.