తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కాంబోలో ఓ సినిమా రానున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తుండగా.. నిన్న ఆదివారం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు - శిరీష్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళంతో పాటుగా పలు భాషల్లో రూపొందించనున్నారు.
ఇది విజయ్ కెరీర్ లో రాబోతున్న 66వ సినిమా.. ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీ. 'మహర్షి' సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న వంశీ పైడిపల్లి.. చాలా గ్యాప్ తీసుకుని తీస్తున్న సినిమా. #Thalapathy66 ప్రాజెక్ట్ గురించి దర్శకుడు వంశీ పైడిపల్లి స్పందిస్తూ.. ''నా హోమ్ బ్యానర్ లాంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో విజయ్ హీరోగా సినిమా చేస్తున్నానని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది'' అని అన్నారు.
''విజయ్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్లో #Thalapathy66 చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నాం. మేం గర్వించే క్షణాలివి'' అని మేకర్స్ తెలిపారు. ఇందులో పని చేసే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 14న ప్రారంభించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. విజయ్ ప్రస్తుతం తమిళంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'బీస్ట్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దసరా లోపు ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసి.. వంశీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలని విజయ్ ప్లాన్ చేస్తున్నారట.
ఈ నేపథ్యంలో విజయ్ ఓ మూడు నెలలు హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వబోతున్నాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇకపై టాలీవుడ్ మార్కెట్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిన విజయ్.. హైదరాబాద్ లోనే ఓ సొంత ఇల్లు తీసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా సమాచారం. 'తుపాకీ' 'అదిరింది' 'విజిల్' 'సర్కార్' 'మాస్టర్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు విజయ్. మరి ఇప్పుడు వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ తో టాలీవుడ్ లో ఏ మేరకు రాణిస్తారో చూడాలి.