తెగ స్పీడుగా సినిమాలు చేసేయడంలో హీరో నాని దిట్ట. ఏడాదికి ఓ ఫిక్సెడ్ అమౌంట్ తన బ్యాంక్ ఖాతాలోకి వచ్చేలా ప్లాన్ చేసుకునే ఈ హీరో.. అందుకోసం రెమ్యూనరేషన్ పెంచడం యాంగిల్ కాకుండా.. ఎక్కువ సినిమాలు చేయడంపై ఫోకస్ పెడతాడు. ప్రొడక్షన్ కాస్ట్ మరీ ఎక్కువగా ఉండకపోవడంతో.. ఈ నేచురల్ స్టార్ సినిమాలు అలా సేఫ్ జోన్ లోకి వచ్చేస్తుంటాయి.
నాని ప్రస్తుతం నిన్ను కోరి చిత్రాన్ని థియేటర్లలోకి తెచ్చే పనిలో ఉన్నాడు. ఇప్పటికే తన తర్వాతి సినిమాను కూడా మొదలుపెట్టేశాడు. వేణు దర్శకత్వంలో రూపొందనున్న మూవీ 'ఎంసీఏ' షూటింగ్ ఇప్పటికే మొదలైపోయింది. ఎంసీఏకు మిడిల్ క్లాస్ అబ్బాయి అని కొత్త అర్ధం చెబుతున్నాడు నాని. ఎంసీఏలో బాలీవుడ్ మూవీ పింక్ లో కీలక పాత్రలో కనిపించిన విజయ్ వర్మ.. ఓ ప్రధాన పాత్ర చేయబోతున్నాడు. ఇప్పటికే దర్శకుడితో మాటా మంతీ పూర్తయిపోవడమే కాదు.. తాను షూటింగ్ లో కూడా పాల్గొంటున్నట్లు విజయ్ వర్మ అఫీషియల్ గా ప్రకటించాడు.
ఓ మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా దర్శకుడు వేణు శ్రీరాం తనను అప్రోచ్ అయ్యాడని.. స్టోరీ నెరేషన్ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశానని.. టాలీవుడ్ అరంగేట్రం చేయడం ఆనందంగా ఉందని అంటున్నాడు విజయ్ వర్మ. తాను హైద్రాబాద్ లోనే థియేటర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు విజయ్ వర్మ. తనకు తెలుగు రాకపోవడంతో ప్రస్తుతం నేర్చుకుంటున్నానని చెప్పిన విజయ్ వర్మ.. ప్రాంప్టింగ్ లేకుండా డైలాగ్స్ చెప్పడంపై ఫోకస్ పెట్టానని అంటున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/