అమ్మకి ఆ తెలివి లేదన్న సావిత్రి కూతురు

Update: 2017-04-26 06:13 GMT
మహానటి సావిత్రి జీవితంపై సినిమా రూపొందుంతుడంతో.. ఇప్పుడు ఆమె లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటి తరానికి కొత్త విషయాలు తెలిసే అవకాశం లభిస్తోంది. సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి.. తన తల్లి జీవిత చరమాంకంలో గడిపిన పలు విషయాలను పంచుకున్నారు. తండ్రి జెమినీ గణేశన్ తో ఉన్న విబేధాలపై కూడా చెప్పారు.

'నా పెళ్లి 16 ఏళ్ల వయసులో జరగగా అంతకు కొన్నేళ్ల ముందే అమ్మానాన్నల మధ్య విబేధాలు మొదలయ్యాయి. అయితే అప్పట్లో నాకు ఏమీ తెలిసేది కాదు. నాన్న లేనపుడు కూడా వాళ్లింటికి వెళ్లేదాన్ని. ఈ సమస్యల కారణంగా ఎక్కువగా నా సోదరుడు ఇబ్బంది పడ్డాడు. అలాగే పెరిగాడు. అమ్మకు సమస్యలను డీల్ చేసేంతటి తెలివితేటలు లేవు. ఆమె చాలా అమాయకురాలు కావడంతో ఎక్కువగా ప్రభావం పడింది. తనకు సరైన గైడెన్స్ కూడా లభించలేదు. అందుకే ఆల్కహాలిక్ గా మారిపోయింది. తను కోమాలోకి వెళ్లిపోయి 19 నెలలు గడిపింది. తను తిరిగొస్తుందనే అంతా అనుకున్నాం. కానీ అలా జరగలేదు' అని చెప్పారు చాముండేశ్వరి.

'విబేధాలు ఎలా ఉన్నా.. అమ్మ ఆ స్థితిలో ఉండడాన్ని నాన్న జీర్ణించుకోలేకపోయారు. ఆ  సమయం అంతా తన దగ్గరే ఉండేవారు. ఆమె మరణానికి ఆర్థిక కష్టాలే కారణం అనుకుంటారంతా. ఆమె మరణించిన తర్వాత కూడా మేమంతా ఇప్పటికీ సంతోషంగానే ఉన్నాం. అంతగా మాకు అందించి వెళ్లిందామె. ఇప్పుడు మేం గడుపుతున్న గొప్ప జీవితం అంతా ఆమె చలవే' అన్న విజయ చాముండేశ్వరి.. ఇప్పటి తరం ఆమె గురించి తెలుసుకునే అవకాశం రావడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News