కృష్ణ-విజయ నిర్మల.. ప్రేమ - పెళ్లి ఎలా.?

Update: 2018-08-05 17:30 GMT

సూపర్ స్టార్ కృష్ణ మొదట మహేష్ బాబు తల్లి ఇందిరను పెళ్లి చేసుకున్నాడు. ఆమె తో సంతానం కలిగాక తనతో పాటు సినిమాల్లో హీరోయిన్ నటించిన విజయ నిర్మలను పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఆమెతోనే ఉంటున్నారు. ఇన్నేళ్ల వారి సంసార జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురుకాలేదు.  అయితే విజయనిర్మల-కృష్ణ ఎలా ప్రేమలో పడ్డారు.? ఎలా పెళ్లి చేసుకున్నారన్నది మాత్రం అంతుచిక్కని ప్రశ్నే.. తాజాగా ఈ విషయాన్ని విజయనిర్మల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అదిప్పుడు వైరల్ గా మారింది.

కృష్ణ నటించిన ‘సాక్షి’ సినిమాలో విజయ నిర్మల హీరోయిన్. అప్పుడు వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందట.. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ సంఘటనే మా పెళ్లికి పునాది పడిందని విజయ నిర్మల చెప్పుకొచ్చింది.

విజయ నిర్మల మాట్లాడుతూ ‘‘సాక్షి సినిమా షూటింగ్ ప్రఖ్యాత మీసాల కృష్ణుడు అనే గుడిలో నిర్వహించారు. అక్కడికి వెళ్లిన ఏ జంట అయినా భార్యభర్తలు అయిపోతారనే టాక్ ఉంది.. అలాంటి గుడిలో మా ఇద్దరి మీద దర్శకుడు బాపు ఓ పాట కూడా చిత్రీకరించారట.. ఆ పాటలో తాళికట్టు శుభవేళ.. అంటూ ఒక వ్యాఖ్యం కూడా ఉంటుంది. ఆ పాట పూర్తయ్యాక కమెడియన్ రాజబాబు వచ్చి మీరిక భార్యభర్తలు అయినట్టేనని సరదాగా అన్నాడు.. దానికి తాను సీరియస్ అయ్యాను’ అని వివరించింది.

ఇక సాక్షి సినిమా ఫుల్ హిట్ కావడంతో కృష్ణ గారితో చాలా సినిమాల్లో నటించానని విజయ నిర్మల చెప్పుకొచ్చింది. ఒక రోజు సినిమా చిత్రకరణలో చంద్రమోహన్ వచ్చి ‘కృష్ణ గారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని’ తనతో చెప్పారు. కానీ కృష్ణ వచ్చి చెబితేనే చేసుకుంటాను అని బదులిచ్చాను. తర్వాత కృష్ణ వచ్చి చెప్పడంతో పెళ్లి చేసుకున్నానని విజయ నిర్మల అలనాటి సంగతులను గుర్తు చేసుకుంది. 
Tags:    

Similar News