కంబ్యాక్ కోసం లేడీ అమితాబ్ క‌ఠోర శ్ర‌మ‌

Update: 2019-06-07 09:36 GMT
లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి కంబ్యాక్ గురించి అభిమానులు ఆస‌క్తిక‌ర ముచ్చ‌టించుకుంటున్న‌ సంగ‌తి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల గ్యాప్ త‌ర్వాత తిరిగి ముఖానికి మేక‌ప్ వేసుకునేందుకు విజ‌య‌శాంతి రెడీ అవుతున్నారు. అది కూడా సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న 26వ సినిమా `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంలో ఓ కీల‌క పాత్ర ద్వారా ఫ్యాన్స్ కి ట్రీటివ్వ‌నున్నారు. ప్ర‌స్తుతం త‌న పాత్ర‌కు త‌గ్గ‌ట్టే మేకోవ‌ర్ కోసం క‌ఠోరంగా శ్ర‌మిస్తున్నార‌ట‌.

కంబ్యాక్ అదిరిపోవాలంటే ఇప్పుడున్న గ్లామ‌ర‌స్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌కు ఏమాత్రం తీసిపోకుండా రెడీ అవ్వాల‌ని డిసైడ‌య్యార‌ట‌. ప్రేక్ష‌కుల్ని మైమ‌రిపించాలంటే ముందుగా త‌న రూపం మార్చుకోవాల‌ని ఫిక్స‌య్యార‌ట‌. మ‌రోవైపు మ‌హేష్ లాంటి స్మార్ట్ హీరోకి అత్త‌గా క‌నిపించాలంటే అంతే స్లిమ్ గా క‌నిపించాల‌న్న లాజిక్ కూడా త‌న జిమ్మింగ్ కి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. అందుకే రెగ్యుల‌ర్ గా ఫిట్ నెస్ జిమ్ కి వెళుతూ క‌ఠోరంగానే శ్ర‌మిస్తున్నార‌ని తెలిసింది. అయితే 40 ప్ల‌స్ లోనూ విజ‌య‌శాంతి శారీర‌కంగా ఫిట్ నెస్ కోసం శ్ర‌మించ‌డం అంటే ఆషామాషీ కాదు. ఆరోగ్యం ప‌రంగా ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుని ఓ ప‌ద్ధ‌తి ప్ర‌కారం జిమ్ శ్ర‌మించాల్సి ఉంటుంది.

90ల‌లో అంద‌రు అగ్ర‌క‌థానాయ‌కుల స‌ర‌స‌న విజ‌య‌శాంతి న‌టించారు. అటుపై లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌ల్ని ఎంపిక చేసుకుని మార్కెట్ వ‌ర్గాల్లోనూ లేడీ బాస్ అని ప్రూవ్ చేసుకున్నారు. అయితే రాజ‌కీయారంగేట్రం వ‌ల్ల కాల‌క్ర‌మంలో వెండితెర‌కు దూర‌మ‌య్యారు. విజ‌య‌శాంతి న‌టించిన చివ‌రి చిత్రం నాయుడ‌మ్మ 2006లో రిలీజైంది. మ‌ళ్లీ ఇంత‌కాలానికి ముఖానికి రంగేసుకోవ‌డం ఆస‌క్తిని పెంచుతోంది. ఇక తాజా సినిమా కోసం లుక్ మార్చుకోవ‌డానికి కార‌ణం ఫిట్ గా ఉండాల‌నుకోవ‌డ‌మేన‌ని విజ‌య‌శాంతి చెబుతున్నార‌ని తెలుస్తోంది.  

    

Tags:    

Similar News