కేవలం వారాల వ్యవధిలో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలకు కథను అందించిన ఘనతను తన ఖాతాలో వేసుకున్న ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కల నెరవేరనుంది. బాహుబలి.. భజరంగీ భాయ్ జాన్ చిత్రాలకు కథను అందించటమే కాదు.. కలెక్షన్లలో రికార్డుల్ని సృష్టిస్తున్న సినిమాలకు కీలకం కావటం తెలిసిందే.
పాకిస్థాన్ కు వెళ్లాలన్న తన కోర్కెను విజయేంద్ర ప్రసాద్ ఈ మధ్యన వ్యక్తం చేశారు. ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తనకు పాక్ కు వెళ్లాలన్న కోరిక తీరలేదని వ్యాఖ్యానించారు. పాక్ కు చెందిన ఒక చిన్నారి తప్పిపోయి భారత్ కు రావటం.. ఆ పాపను పాక్ లోని ఆమె తల్లిదండ్రులకు అప్పజెప్పేందుకు సరిహద్దులు దాటి వెళ్లి ఆ పని పూర్తి చేసిన ఇతివృత్తంతో వచ్చిన భజరంగీ భాయ్ జాన్ చిత్రం విజయవంతం కావటం తెలిసిందే.
చిత్రంలో మాదిరి కాకున్నా.. తనకు పాక్ వెళ్లి.. అక్కడి సామాన్యులతో మచ్చటించాలని ఉందని.. కాకపోతే.. ఏదైనా కార్యక్రమం కోసమైతేనే తాను పాక్ కు వెళతానని విజయేంద్రప్రసాద్ తన మనసులోని మాటను చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు స్పందన వచ్చింది. హైదరాబాద్ పాతబస్తీకు చెందిన ‘‘కోవా’’ అనే స్వచ్ఛంధ సంస్థ స్పందించింది. విజయేంద్ర ప్రసాద్ ను పాక్ కు తీసుకెళ్లేందుకు ముందుకు వచ్చింది.
ఆయన కోరుకున్నట్లుగా పాక్ లో పర్యటించేలా ప్లాన్ చేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా సాగితే.. ఆగస్టు 14.. 15 తేదీల్లో జరిగే ఆ దేశ స్వాతంత్య వేడుకల్లో భాగంగా విజయేంద్ర ప్రసాద్ ను పాక్ కు తీసుకెళతామని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. మొత్తానికి భాయ్ జాన్ కి బాప్ (తండ్రి) అయిన విజయేంద్ర ప్రసాద్ పాక్ కల సాకారం కానుందన్న మాట.