నిన్నటివరకూ టాలీవుడ్, బాలీవుడ్ లో రాజమౌళి గురించే మాట్లాడుకున్నారు. ఇప్పుడు అతడి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గురించి మాట్లాడుకుంటున్నారు. తండ్రికి తగ్గ తనయుడు, తనయుడికి తగ్గ తండ్రి అంటూ తెగ పొగిడేస్తున్నారు. అంతేనా ఓ రచయితగా విజయేంద్రుడి ప్రతిభ గురించి భారతదేశమంతటా జేజేలు పలుకుతున్నారు. అసలు విషయంలోకి డీప్ గా వెళితే..
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రానికి కథ రాసింది విజయేంద్ర ప్రసాద్. ఈ సినిమా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇంతవరకూ రాని అరుదైన జోనర్ లో వచ్చి అన్ని రికార్డుల్ని కొట్టేసింది. అయితే ఈ సినిమా కథ విషయంలో పొరుగున ప్రశంసలు వచ్చినా, తెలుగు విమర్శకులు మాత్రం పెదవి విరిచేశారు. ప్రథమార్థంలో కథే లేదని, ఎమోషన్స్ అసలే లేవని అన్నారు. అయితే ద్వితీయార్థం వార్ ఎపిసోడ్స్ హైలైట్ అవ్వడంతో కాస్త శాంతించారు. ఏదేమైనా అంచనాల్ని మించి రికార్డులు సాధించిందీ చిత్రం. ఇప్పుడు బాహుబలి రైటర్ నుంచి వస్తున్న 'భజరంగి భాయిజాన్' అంటూ ప్రచారం చేసుకుంటూ సల్మాన్ ఖాన్ సైతం హిట్టు కొట్టేశాడు.
మొన్న రిలీజైన భజరంగి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాకి కూడా విజయేంద్రప్రసాద్ కథ అందించారు. అంతేనా బాహుబలి పై వచ్చిన విమర్శలేవీ ఈ సినిమాకి రాలేదు. భజరంగి కథలో బోలెడన్ని ఎమోషన్స్ ఉన్నాయి. పాకిస్తాన్ బార్డర్, పసి పిల్ల నేపథ్యంలో రాసిన కథలో ట్విస్టులు, ఎమోషన్స్ అందరినీ కట్టిపడేస్తున్నాయి. బాలీవుడ్ లో ఇలాంటి జోనర్ అరుదు అంటూ ప్రశంసలొస్తున్నాయి.
ఆ రకంగా వారం తేడాలో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ కి రచయితగా విజయేంద్రుడి పేరు మార్మోగిపోతోంది. ఎమోషన్స్ ను పట్టుకొని వండేశాడని కితాబులు ఇస్తున్నారు. ఈ దెబ్బతో ఈయన ఇండియా వైడ్ పాపులర్ రైటర్ అయిపోయారంఏట అతిశయోక్తి కాదేమో.