వారం వ్యవధిలో ఓ రచయిత కథ అందించిన సినిమాలు బాక్సాఫీస్‌ను దున్నేయడం అరుదుగా జరిగే విషయం. ఇప్పుడు ఇండియాలో ఇదే జరుగుతోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథలు అందించిన బాహుబలి, భజరంగి భాయిజాన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. వారం కిందే విడుదలైన బాహుబలి బాలీవుడ్ జనాలు సైతం విస్తుపోయేలా వసూళ్ల ప్రభంజనమే సాగిస్తోంది. ఈ సినిమాకు కథకు విజయేంద్ర ప్రసాదే అన్న సంగతి తెలిసిందే. ఆయన కథకు రాజమౌళి స్క్రీన్ ప్లే, దర్శకత్వ ప్రతిభ తోడై బాహుబలి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకుంటోంది.
ఐతే ఇప్పటిదాకా తెలుగు సినిమాలకు మాత్రమే కథలు అందించిన విజయేంద్ర ప్రసాద్.. తొలిసారి ఓ బాలీవుడ్ సినిమాకు, అది కూడా సల్మాన్ లాంటి పెద్ద స్టార్ మూవీకి కథ అందించడం విశేషమే. మామూలుగా అయితే సల్మాన్ సినిమాల్లో కథలకు పెద్దగా ప్రాధాన్యం ఏమీ ఉండదు. అందుకే విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నాడంటే అతనెవరని కూడా ఆరా తీసి ఉండరు బాలీవుడ్ జనాలు. ఐతే సినిమా చూశాక మాత్రం కథ గురించి చర్చించుకుంటూ రాజమౌళి ఫాదర్ ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఇప్పటికే బాహుబలి కథకుడిగా ఆయన పేరు వారికి పరిచయమైంది. ఇప్పుడు ‘భజరంగి భాయిజాన్’ సినిమాతో ఆయన పేరక్కడ మార్మోగిపోతోంది.