బాలీవుడ్లో కొన్నేళ్లుగా స్పోర్ట్స్ పర్సన్స్ బయోపిక్స్ హవా నడుస్తోంది. బాగ్ మిల్కా బాగ్.. మేరీకోమ్.. అజహర్ లాంటి సినిమాలు ఇప్పటికే మంచి విజయం సాధించాయి. ఇంకా ధోని మీద ఓ సినిమా.. సచిన్ మీద ఓ సినిమా కూడా రాబోతున్నాయి. మరికొన్ని లైన్లో ఉన్నాయి. ఐతే మన లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా ఒక సెన్సేషనల్ బయోపిక్ కు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటిదాకా బాలీవుడ్ లో వచ్చిన.. రాబోతున్న బయోపిక్స్ అన్నీ జనాలకు బాగా పరిచయం ఉన్న క్రీడాకారులవే. ఐతే విజయేంద్ర ప్రసాద్ మాత్రం సామాన్య జనాలకు పెద్దగా పరిచయం లేని.. మన దేశానికే చెందని ఓ పర్వతారోహకుడి జీవిత కథను సినిమా స్క్రిప్టుగా మలిచే ప్రయత్నంలో ఉన్నారు. ఆ క్రీడాకారుడి పేరు టెన్జింగ్ నార్గే.
నేపాల్ దేశానికి చెందిన సాహసోపేత పర్వాతోరోహకుడు టెన్జింగ్ నార్గే. ఎవరెస్టుతో పాటు ఎన్నో పెద్ద పర్వతాల్ని అధిరోహించి చరిత్ర సృష్టించాడు టెన్జింగ్ నార్గే. ఎన్నో కష్టాలకు ఓర్చి ఆయన చేసిన సాహసాలు ఎందరికో స్ఫూర్తి. 20వ శతాబ్దంలో ప్రపంచంలో అత్యంత ప్రభావంతులైన వ్యక్తుల్లో ఒకడిగా టైమ్ మ్యాగజైన్ ఆయనకు గౌరవాన్నిచ్చింది. ఆయన మన దేశంలోనే స్థిరపడ్డారు. పశ్చిమ బెంగాల్ లోని డార్జీలింగ్ లో నివాసమున్నారు. 1986లో అక్కడే చనిపోయారు. ఇలాంటి ఆసక్తికర నేపథ్యం ఉన్న వ్యక్తి మీదికి విజయేంద్ర ప్రసాద్ దృష్టిమళ్లడం.. స్క్రిప్టు రాయడం విశేషమే. ప్రస్తుతం ఆ స్క్రిప్టు మీదే పని చేస్తున్నట్లు విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో పాటు ‘నాయక్’.. ‘రౌడీ రాథోడ్’ సీక్వెల్స్ కు కూడా స్క్రిప్టు రాస్తున్నట్లు ఆయన తెలిపారు.