బాహుబలి బృందంలో ఒకే ఒక్కడు

Update: 2015-07-30 11:47 GMT
బాహుబలి మానియా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటికే 470కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్‌ వసూళ్లలో దూసుకుపోతోంది. ఈ చిత్రం 500కోట్ల క్లబ్‌ లో చేరడానికి ఇంకెంతో సమయం లేదు. అయితే ఈ శుభవేళ చిత్రయూనిట్‌ ఎక్కడివాళ్లు అక్కడే గప్‌ చుప్‌ అన్నట్టే కనిపిస్తున్నారు. జక్కన్నకు ప్రస్తుతం తీరిక సమయం చిక్కింది కాబట్టి ఈ మూడేళ్లలో తను మిస్సయిన సినిమాలన్నిటినీ చూసేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు.

ప్రభాస్‌ పెరిగిన ఇమేజ్‌ తో బిజేపీ నేతల్ని మీటవుతూ రాజకీయ వర్గాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే అనుష్క బాహుబలి 2లో రాకుమారి పాత్రలో మెరవడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ప్రస్తుతం పెరిగిన బరువును తగ్గించుకునే పనిలో పడింది. రెగ్యులర్‌ గా జిమ్ముల్లో కుస్తీలు పడుతూ శ్రమిస్తోంది. అలాగే మిల్కీ వైట్‌ బ్యూటీ తమన్నా ప్రస్తుతం కార్తీ, నాగార్జున సినిమా కోసం యూరప్‌ ట్రిప్‌ లో ఉంది. రమ్యకృష్ణ రకరకాల కమిట్‌ మెంట్ల తో బిజీ అయిపోయారు. సత్యరాజ్‌ షూటింగులతో బిజీ. రానా రకరకాల షూటింగుల కోసం చెన్నయ్‌ టు హైదరాబాద్‌ చక్కర్లు కొడుతున్నాడు.

ఇక మిగిలింది విజయేంద్ర ప్రసాద్‌ ఒక్కరే. ఆయన ప్రస్తుతం టీవీ చానెళ్లు, పత్రికలకు ఇంటర్వ్యూ లు ఇస్తూ తన అనుభవాల్ని పంచుకుంటున్నారు. అందుకే బాహుబలి బృందంలో ఒకే ఒక్కడు అని కీర్తిస్తోంది.
Tags:    

Similar News