రాజమౌళితో ఆయన తొలిసారి అలా..

Update: 2017-01-10 08:52 GMT
తండ్రికి పుత్రోత్సాహం అతడు పుట్టినపుడు కాదు.. ప్రయోజకుడు అయినప్పుడు కలగాలి అంటారు. మన దర్శక ధీరుడు రాజమౌళి తన తండ్రికి ఎప్పుడో పుత్రోత్సాహం కలిగించాడు. కానీ జక్కన్న ఎన్నో విజయాలు సాధించినా.. అతడి తండ్రికి ఆనలేదట. మగధీర.. ఈగ లాంటి సినిమాలు తీసినపుడు కూడా విజయేంద్ర ప్రసాద్ రాజమౌళిని అభినందించింది లేదట. కానీ ‘బాహుబలి’ చూశాక మాత్రం తన తండ్రి ఎగ్జైట్ అయిపోయాడని చెప్పాడు రాజమౌళి. ఈ సినిమా చూసిన వెంటనే తన తండ్రి తనను ఒకటికి మూడుసార్లు కౌగిలించుకున్నాడని.. ఆ సంఘటనతో తాను కూడా చాలా ఎమోషనల్ అయిపోయానని రాజమౌళి చెప్పాడు. దీన్ని బట్టే ఆ సినిమా చరిత్ర సృష్టిందని తనకు అర్థమైందని కూడా చెప్పాడు.

ఇక ‘బాహుబలి: ది కంక్లూజన్’ విషయంలో మరింత శ్రద్ధ పెట్టి పని చేశామన్న రాజమౌళి.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. మహాభారత కథను ఇండియన్ స్క్రీన్ మీద మునుపెన్నడూ చూడని స్థాయిలో తీయలన్నది తన చిరకాల వాంఛ అని.. ఆ దిశగా తన ఆలోచనలు సాగుతున్నాయని చెప్పిన రాజమౌళి.. ఈ కథలోంచి చిన్న ఉపకథ తీసుకున్నా.. ఒక పాత్ర తీసుకున్నా తాను చాలా ఎగ్జైట్ అవుతానని చెప్పాడు. చిన్నప్పుడు చదువుకున్న అమర్ చిత్ర కథలు తనపై ఎంతో ప్రభావం చూపించాయని.. వాటి ఆధారంగానే తాను సినిమాలు తీస్తుంటానని అన్నాడు. తాను ఇప్పటిదాకా చేసిన సినిమాల నుంచే ఎంతో నేర్చుకుంటూ వచ్చానని.. ఆ అనుభవంతోనే ‘బాహుబలి’ తీశానని రాజమౌళి తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News