టాలీవుడ్ , బాలీవుడ్ లలో సీక్వెల్ టైమ్ నడుస్తోంది. గతంలో బ్లాక్ బస్టర్ లు గా నిలిచి కాసుల వర్షం కురిపించిన చిత్రాలకు ప్రస్తుతం సీక్వెల్స్ ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ కోవలో మరో బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ రాబోతోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దాదాపు 15 ఏళ్ల క్రితం చేసిన చిత్రం `విక్రమార్కుడు`. కె.వి.విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించారు. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఇప్పటికీ రవితేజ కెరీర్‌లో మాస్టర్ పీస్ గా నిలిచింది.
ఇదే చిత్రం ఐదు భాషల్లో రీమేక్ అయింది. ఆ ఐదు భాషల్లోనూ సూపర్ హిట్ అనిపించుకుంది. తమిళలో హీరో సూర్య `సిరుతై` పేరుతో రీమేక్ చేయగా దీనికి `విశ్వాసం` డైరెక్టర్ శివ డైరెక్ట్ చేశారు. ఇక హిందీలో రీమేక్ అయిన ఈ మూవీలో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తే ప్రభుదేవా డైరెక్ట్ చేశారు. సొనాక్షీ సిన్హా హీరోయిన్ గా నటించింది. సంజయ్ లీలా భన్సాలీ, రోనీ స్క్రూ వాలా నిర్మించారు. బాలీవుడ్ లోనూ ఈ మూవీ విజయదుందుభి మోగించి భారీ వసూళ్లని రాబట్టింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఒకటి బయటికి వచ్చింది. 2012లో రీమేక్ అయిన ఈ చిత్రానికి సీక్వెల్ ని చేయబోతున్నామంటూ 2019లో బాలీవుడ్ మేకర్స్ ప్రకటించారు. కానీ ఇంత వరకు అది ముందుకు కదలలేదు. తాజాగా దీనికి సంబంధించిన ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల సంజయ్ లీతా భన్సాలీ ఈ చిత్ర సీక్వెల్ కథని సిద్ధం చేయమని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ని సంప్రదించారట.
ఈ విషయాన్నిస్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఓ మీడియాతో ముచ్చటిస్తూ వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం `రౌడీ రాథోర్` సీక్వెల్ కు కథని సిద్ధం చేసే పనిలో వున్నాను. ఇటీవలే దీని గురించి సంజయ్ లీలా భన్సాలీ తనని కలిశారని చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కథ కేవలం హిందీ సీక్వెల్ కోసమేనని చెబుతున్నారు.