వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్ లకు కథలందించారు విజయేంద్ర ప్రసాద్. బాహుబలి, భజరంగి భాయిజాన్ రెండు చిత్రాలకు కథలు అందించింది ఆయనే. ఇవి రెండూ 400కోట్ల క్లబ్ లో చేరే సినిమాలుగా పాపులర్ అయ్యాయి. ఈ సినిమాల తర్వాత విజయేంద్రుని ప్రణాళిక ఏమిటి? అని ఆరాతీస్తే .. భారీ ప్రణాళికలకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఒకటి బాహుబలి -2 చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి కథ కోసం కసరత్తులు చేస్తున్నారు. బాహుబలి : ది బిగినింగ్ సక్సెస్ ని బట్టి రెండో భాగంలో అసాధారణమైన కథ ఏదైనా ఉండాలని అతడు భావిస్తున్నాడు.
అలాగే దీంతో పాటే హైదరాబాదీ భాగమతిపై ఓ కథను రాస్తున్నారాయన. టైటిల్ పాత్రలో కథానాయిక ఎవరో చెప్పాల్సి ఉంది. అలాగే తెలుగు హీరో లేదా బాలీవుడ్ హీరో ఈ చిత్రంలో నటించే ఛాన్సుంది. అలాగే ఓ వివాదాస్పద అంశాన్ని టచ్ చేస్తూ ఓ థ్రిల్లర్ కథాంశాన్ని రెడీ చేశారు ఇప్పటికే. ఇందులో లీడ్ పాత్రధారి ఓ లెస్బియన్. స్వలింగ సంపర్కం, సైకలాజికల్ డిజార్డర్స్ నేపథ్యంలోని సినిమా ఇది. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ స్వయంగా దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే సెట్స్ కెళ్లే ఛాన్సుంది.
శ్రీకృష్ణ 2006, రాజన్న వంటి సినిమాలకు గతంలో విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. కానీ అవి ఆశించినంత విజయం సాధించలేదు. విజయవంతమైన ఎన్నో చిత్రాలకు కథలు అందించారు తప్ప దర్శకుడిగా సక్సెస్ కాలేదు. సక్సెస్ డైరెక్టర్ అన్న ట్యాగ్ అవసరం కాబట్టి లెస్బియన్ సైకలాజికల్ థ్రిల్లర్ కలిసొస్తుందేమో చూడాలి.