150 కోట్లు డిమాండ్ చేస్తున్న విజయేంద్ర ప్రసాద్

Update: 2016-04-17 17:30 GMT
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు.. 9 నెలలుగా దేశవ్యాప్తంగా ఎన్నో కోట్ల మందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. ‘బాహుబలి’ యూనిట్లో ఎవ్వరిని అడిగినా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. మీడియా వాళ్లు కూడా ఈ ప్రశ్న అడిగి అడిగి అలసిపోయారు. ఇక లాభం లేదని.. విజయేంద్ర ప్రసాద్ ను ఓ ఇంటర్వ్యూలో గట్టిగా అడిగితే సమాధానం చెప్పడానికి ఒప్పుకున్నారు. కానీ ఆ జవాబు చెప్పాలంటే రూ.150 కోట్లు డిమాండ్ చేశారాయన. ఆ మేరకు చెక్కు ఇచ్చేస్తే బాహుబలిని కట్టప్ప ఎందుకు పొడిచాడో చెప్పేస్తానని చమత్కరించారాయన. ఇంతకీ బాహుబలి బతికే ఉండొచ్చంటూ ఈ మధ్య చేసిన వ్యాఖ్యల గురించి అడిగితే సమాధానం దాటవేశారు విజయేంద్ర ప్రపాద్.

బాహుబలి-ది బిగినింగ్ భారీ విజయం సాధించడం వల్ల ‘బాహుబలి-ది కంక్లూజన్’ మీద అంచనాలు పెరిగిన నేపథ్యంలో ముందు అనుకున్న కథలో ఏమైనా మార్పులు చేశారా అని అడిగితే.. అలాంటిదేమీ లేదని చెప్పారు విజయేంద్ర ప్రసాద్. తాను ఇంతకుముందు రాసిన కథలో ఏ మార్పులూ చేయలేదని.. స్క్రీన్ ప్లే విషయంలో చిన్న చిన్న మార్పులు జరిగి ఉండచ్చని అన్నారు. తాను కథ రాసేటపుడు మొదటిసారి ఎవరైనా మార్పులు చెబితే వింటానని.. కానీ రెండోసారి విననని.. అది తన కొడుకు రాజమౌళి అయినా అంతేనని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. బాహుబలి ఫస్ట్ పార్ట్ త్వరలోనే చైనాలో భారీ స్థాయిలో విడుదల కాబోతోందని.. అక్కడ కూడా రూ.100 కోట్ల దాకా కలెక్షన్లు వస్తాయిని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. తన దర్శకత్వంలో వచ్చిన ‘రాజన్న’ కమర్షియల్ సక్సెస్ కాలేదన్న అసంతృప్తి ఉండేదని.. ఐతే తెలుగు.. కన్నడ.. తమిళ భాషల్లో తాను రూపొందిస్తున్న కొత్త సినిమా ‘వల్లి’ ఆ అసంతృప్తిని తీర్చేసి పెద్ద హిట్టు అవుతుందని భావిస్తున్నానని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
Tags:    

Similar News