దళపతి కొడుకుతో సేతుపతి సినిమా..ఓకే నా?

Update: 2020-04-22 17:30 GMT
కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ కలిగిన హీరో ఇళయదళపతి విజయ్. అయితే విజయ్ కొడుకు సంజయ్ త్వరలో హీరో అయ్యే ప్లాన్ లో ఉన్నాడట. ప్రస్తుతం కెనడాలో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడట సంజయ్. లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఇరుక్కుపోయాడు. సరైన కథ దొరికితే తన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చాలా రోజులుగా విజయ్ అనుకుంటున్నాడట. ప్రస్తుతం సంజయ్ 19 ఏళ్ల కుర్రాడు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ కొత్త హీరో వైష్ణవ్ తేజ్ తో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన కథ విజయ్‌కు బాగా నచ్చిందని సమాచారం. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎప్రిల్ 2నే విడుదల కావాల్సి ఉండగా.. జూన్‌కు వాయిదా పడింది.

నల్గొండ పరువు హత్యల నేపథ్యంలో ఈ సినిమా కథను రాసుకున్నాడట బుచ్చిబాబు. విషాందాంత ప్రేమకథగా ఉప్పెనను రూపొందించారని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా ఇంకా విడుదలే కాలేదు అప్పుడే తమిళనాట రీమేక్ కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ వైష్ణవ్ తేజ్ పరిచయం అయినట్లే.. అక్కడ కూడా స్టార్ హీరో విజయ్ కొడుకు ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఉప్పెన సినిమాలో విలన్‌గా నటించిన విజయ్ సేతుపతి.. ప్రస్తుతం విజయ్‌తో మాస్టర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌లో ఉప్పెన కథ గురించి విజయ్‌కి వివరించాడట సేతుపతి. ఈ కథ అయితే సంజయ్ సరిగ్గా సరిపోతుందని విజయ్ సేతుపతి చెప్పడంతో విజయ్ కూడా ఓకే అన్నట్లు సమాచారం. ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రితో పాటు విలన్ పాత్ర కూడా చేస్తున్నాడు విజయ్ సేతుపతి. తమిళనాట ఈ సినిమాను తానే నిర్మించాలని అనుకుంటున్నాడట విజయ్ సేతుపతి.
Tags:    

Similar News