అప్పుడప్పడు కొందరు ప్రముఖులు ఓపెన్ అయిపోతుంటారు. ఇలాంటి వేళలో వారి నోటి నుంచి వచ్చే నిజాలు అవాక్కు అయ్యేలా ఉంటాయి. తాజాగా అలాంటి షాకింగ్ మాటే చెప్పి అందరి దృష్టిని తన మీద పడేలా చేశాడు బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్. సన్నజాజి లాంటి బాలీవుడ్ నటి.. అంతకు మించి మాజీ విశ్వసుందరిగా తన అందంతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన సుస్మితాసేన్ కోసం తానేం చేసింది.. తానేం చేయాలనుకున్నది చెప్పుకొచ్చాడు.
బాలీవుడ్లో సుస్మిత మాంచి ఫాంలో ఉన్న వేళ.. తామిద్దరం ప్రేమించుకున్నామని చెప్పాడు. భార్యతో విడిపోయిన తర్వాత సుస్మిత.. నేనూ ప్రేమించుకున్నాం.. ఆ తర్వాత ఆమెతో బ్రేకప్ అయ్యిందని వెల్లడించాడు. సుస్మిత బ్రేకప్ సమయంలోనే.. తాను తీసిన గులాం మూవీ విడుదల కావాల్సి ఉందని.. మరోవైపు తన కూతుర్ని చాలా మిస్ అయిన భావనతో.. ఆ ఆలోచనలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లుగా చెప్పి షాక్ తినేలా చేశాడు.
ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఓపెన్ అయిన విక్రమ్ భట్.. తన భార్య ఆదితిని బాధ పెట్టి.. పిల్లల్ని విడిచి పెట్టినందుకు తాను చాలా బాధ పడుతున్నట్లుగా వెల్లడించాడు. లైఫ్ లో మనం చేసే ప్రతి పనీ మనకు ఏదో ఒక ఫాఠం నేర్పుతుందన్న ఆయన.. తాను నేర్చుకున్న పాఠాన్ని మరింత క్లారిటీగా చెప్పి ఉంటే బాగుండేదేమో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/