తమిళ స్టార్ హీరో విక్రమ్ తెలుగులో కూడా మంచి మార్కెట్ ను కలిగి ఉన్నాడు. తెలుగు లో ఈయన నటించిన పలు సినిమా లు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసిన విషయం తెల్సిందే. ఇక విక్రమ్ తనయుడు ధృవ్ ను తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమా తో పరిచయం చేయడం జరిగింది. ఆధిత్య వర్మ గా వచ్చిన ధృవ్ మొదటి సినిమా తోనే సక్సెస్ ను దక్కించుకున్నాడు. దాంతో ధృవ్ తదుపరి సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్న సమయంలో ఆసక్తికర ప్రకటన వచ్చింది. ధృవ్ రెండవ సినిమాగా విక్రమ్ 60వ సినిమా రాబోతుందని దానికి ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించబోతున్నట్లుగా ఏడాదిన్నర క్రితం ప్రకటన వచ్చింది. తండ్రి కొడుకుల కాంబోలో మూవీ అనగానే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
విక్రమ్ అభిమానులు ఏడాదిన్నర కాలంగా ఈ సినిమా ను ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారా అంటూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. తండ్రి కొడుకు విక్రమ్ ధృవ్ లు ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ సినిమా కు పెద్ద ఎత్తున అంచనాలున్న నేపథ్యంలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ వీరిద్దరిని కూడా చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నాడు. ఈ సినిమా లో విక్రమ్ ను నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో దర్శకుడు చూపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సినిమాలో పాత్రల విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ఏడాదిన్నరగా వెయిట్ చేస్తున్న క్రేజీ కాంబో మూవీ పట్టాలెక్కిన నేపథ్యంలో సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.