రెండు నెలల కిందటే ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో పలకరించాడు తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్. ఈ సినిమా తెలుగులో నిరాశ పరిచినా.. తమిళంలో మాత్రం సూపర్ హిట్టవడం విశేషం. ఈ ఉత్సాహంలో తన తర్వాతి సినిమాను విడుదలకు రెడీ చేస్తున్నాడు గౌతమ్. ధనుష్ హీరోగా గౌతమ్ రూపొందించిన ‘ఎన్నై నొక్కి తోటా పాయుం’ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి గత నెలలో రిలీజ్ చేసిన పోస్టర్లు.. టీజర్ అన్నీ కూడా వావ్ అనిపించాయి. ఆ జోష్ నుంచి గౌతమ్ ఫ్యాన్స్ ఇంకా బయటపడకముందే.. ‘ధృవ నక్షత్రం’ పేరుతో ఓ క్రేజీ ప్రాజెక్టు మొదలుపెట్టి.. రోజుకో పోస్టర్‌తో రచ్చ చేస్తున్నాడు గౌతమ్.
‘ధృవ నక్షత్రం’ అనే సినిమాను సూర్యతో చేయాలనుకున్నాడు గౌతమ్. మూడేళ్ల కిందటే ఆ సినిమా మొదలవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల సూర్య ఆ చిత్రం నుంచి బయటికి వచ్చాడు. అయినప్పటికీ ఈ సినిమా మీద ఆశలు వదిలేయకుండా ఇప్పుడు విక్రమ్ హీరోగా ప్రాజెక్టు లాంచ్ చేశాడు గౌతమ్. గత ఐదు రోజులుగా ఈ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త పోస్టర్ వదులుతున్నాడు గౌఃతమ్. విక్రమ్ ఇందులో హాలీవుడ్ హీరోలాగా చాలా స్టైలిష్ గా, కొత్తగా కనిపిస్తున్నాడు. ఎప్పుడో పక్కాగా రెడీ అయిన స్క్రిప్టు కావడంతో గౌతమ్ చాలా వేగంగా సినిమాను పూర్తి చేసేస్తున్నాడట. ఈ ఏడాది మధ్యలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది ప్లాన్. అందుకోసం ఇప్పట్నుంచే ప్రమోషన్లు మొదలుపెట్టేసినట్లున్నాడు గౌతమ్. ఈ చిత్రంలో విక్రమ్ సరసన ‘మజ్ను’ హీరోయిన్ అను ఇమ్మాన్యుయెట్ కథానాయికగా నటిస్తుండటం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/