అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ చిత్రం విడుదలైన నెల గ్యాప్ లోనే విక్రమ్ కుమార్ తో ఒక చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నాడు అంటూ అప్పుడు వార్తలు వచ్చాయి. అయితే నా పేరు సూర్య చిత్రం ఫలితం బన్నీని ఆలోచనలో పడేసింది. దాంతో విక్రమ్ కుమార్ రెడీ చేసిన కథకు మార్పులు చేర్పులు చెప్పడం జరిగింది. దాదాపు మూడు నాలుగు నెలలు కూర్చున్నా కూడా విక్రమ్ కుమార్ కథను అల్లు అర్జున్ అండ్ కో కు నచ్చే విధంగా రెడీ చేయలేక పోయాడట. ఈలోపు త్రివిక్రమ్ ‘అరవింద సమేత’ చిత్రంను పూర్తి చేసుకుని బన్నీతో సినిమాకు రెడీ అయ్యాడు. దాంతో విక్రమ్ కుమార్ మరో ప్రాజెక్ట్ ను చూసుకుంటున్నాడు.
ఈ సమయంలోనే ఒక తమిళ రచయిత చెప్పిన కథ బాగా నచ్చడంతో అల్లు అర్జున్ అండ్ టీం ఆ కథను విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చారట. అయితే సొంత కథలతో మాత్రమే సినిమాలు చేసే విక్రమ్ మొదట నో చెప్పినా కూడా మెగా కాంపౌండ్ ఆయన్ను ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంను స్వయంగా అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. అయితే ఈ చిత్రంకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.
అల్లు అర్జున్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో అనేది ఇప్పటికే ఫిక్స్ అయ్యింది. త్వరలోనే ఆ సినిమా ప్రారంభం కాబోతుంది. వచ్చే ఏడాది చివరికి గాని బన్నీ సినిమా వచ్చే అవకాశం లేదు. అందుకే విక్రమ్ కే కుమార్ తో బన్నీ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన అయితే వచ్చే అవకాశాలున్నాయి.