బాల బన్నీ.. పెద్ద టార్గెట్టే ఉందట

Update: 2015-07-21 06:11 GMT
రేసుగుర్రం సినిమాలో బన్నికి చిన్నప్పటి క్యారెక్టర్‌ లో నటించాడో బుజ్జాయి రేసుగుర్రం.. ఆ కుర్రాడే కళ్యాణ్‌ రామ్‌ పటాస్‌ లో బుల్లి బుజ్జి పటాసుగానూ నటించాడు. అటు పై కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ చిత్రం లో సుధీర్‌ బాబుకు చిన్నప్పటి పాత్ర లో నటించాడు. అసలింతకీ ఈ బాల నటుడు ఎవరో తెలుసా?

పేరు విక్రమ్‌. ఈ పేరు టాలీవుడ్‌ సర్కిల్స్‌ లో బాగానే ఫేమస్‌ అవుతోంది. అయితే ఈ కుర్రాడి బ్యాక్‌ గ్రౌండ్‌ చిన్నది ఏమీ కాదు. లగడపాటి రాజగోపాల్‌ తమ్ముడు ప్రొడ్యూసర్‌ లగడపాటి శ్రీధర్‌ కి గారాల తనయుడు. శ్రీధర్‌ ఇప్పటికే టాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు తీస్తూ ప్రముఖ నిర్మాత గా పేరు తెచ్చుకున్నారు. తనయుడిని ఎలా అయినా పెద్ద హీరోని చేయాలన్నది అతడి లక్ష్యం. అందుకే స్కూల్‌ డేస్‌ నుంచే సానబడుతున్నారు. అన్నట్టు మొన్నటి రోజున టీఎస్సార్‌-టీవీ9 అవార్డు ల్లో ఈ బాలనటుడు ఓ పురస్కారం దక్కించుకున్నాడు. అది కూడా మెగాస్టార్‌ చిరంజీవి, నటసింహా బాలకృష్ణ చేతులమీదుగా అవార్డు అందుకున్నాడు.

ఈ సందర్భంగా విక్రమ్‌ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. త్వరలోనే విక్రమ్‌ లీడ్‌ పాత్రలో 'గోలిసోడా' అనే తమిళ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయబోతున్నారు. లగడపాటి శ్రీధర్‌ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అధికారికంగా వివరాలు వెల్లడించనున్నారు. ఈ బుల్లి బన్నీ మరి బన్నీ అంత ఎదగాలంటే.. చాలా పెద్ద పెద్ద టార్గెట్లే ముందున్నాయి.
Tags:    

Similar News