తమిళ నటుడు మాధవన్ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు కూడా ఒక రకమైన పులకింత కలుగుతుంది. ‘సఖి’ సినిమాతో అతను అలాంటి ముద్ర వేశాడు మరి. ఆ తర్వాత కూడా యువ.. సత్యమే శివం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు మాధవన్. బాలీవుడ్లో సైతం అతను గొప్ప నటుడిగా పేరు సంపాదించాడు. ఐతే మాధవన్ గత కొన్నేళ్లలో బాగా స్పీడు తగ్గించేశాడు. అలాగని అతడిని తమిళ ప్రేక్షకులేమీ మరిచిపోలేదు. గత ఏడాది ‘ఇరుదు సుట్రు’ సినిమాలో మాధవన్ నటనకు ఫిదా అయిపోయారు. ఇక మాధవన్ స్పీడు తగ్గించేసిన టైంలో విజయ్ సేతుపతి అనే నటుడు ఇంతింతై అన్నట్లు ఎదిగిపోయాడు. అద్భుతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అతను సైతం తెలుగు ప్రేక్షకులకు కొంత పరిచయమే.
విలక్షణ నటులుగా పేరు తెచ్చుకున్న మాధవన్.. విజయ్ సేతుపతి కలిసి ఇప్పుడో సినిమా చేస్తుండటం విశేషం. అదే.. విక్రమ్ వేద. ఇందులో మాధవన్ ఒక పోలీస్ ఆఫీసర్ అయితే.. విజయ్ సేతుపతి ఒక నేరస్థుడు. వీళ్లిద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగే పోరాటమే ‘విక్రమ్ వేద’. మాధవన్-విజయ్ సేతుపతి కాంబినేషన్ మీద జనాలకు ఉన్న క్యూరియాసిటీకి తగ్గట్లే ఈ చిత్ర టీజర్ అదిరిపోయేలా ఉండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది తమిళంలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఇదొకటి అనడంలో సందేహం లేదు. టీజర్ చూసిన వాళ్లందరూ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. పుష్కర్-గాయత్రి అనే ఇద్దరు దర్శకులు కలిసి ఈ సినిమాను రూపొందించడం విశేషం. ఈ చిత్రం తెలుగులోనూ విడుదలయ్యే అవకాశాలున్నాయి.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/