ట్రైలర్‌ : హై ఓల్టేజ్ యాక్షన్‌ డ్రామా విక్రమ్‌ వేద

Update: 2022-09-15 09:31 GMT
తమిళంలో సూపర్ హిట్ అయిన విక్రమ్‌ వేద సినిమాను హిందీలో అదే టైటిల్‌ తో రీమేక్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ లో మాధవన్ మరియు విజయ్ సేతుపతి హీరోలుగా నటించగా హిందీ రీమేక్ లో బాలీవుడ్‌ సూపర్ స్టార్స్ అయిన హృతిక్‌ రోషన్ మరియు సైఫ్‌ అలీ ఖాన్ లు హీరోలుగా నటించారు. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమాను రూపొందించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

సెప్టెంబర్‌ 30వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విక్రమ్‌ వేద సినిమా ట్రైలర్ ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ట్రైలర్ లో భారీ హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చూపించడంతో పాటు శృతి మించిన హింసను చూపించారు. మరీ ఈ స్థాయి హింస ని ఒక వర్గం ప్రేక్షకులు ఇష్టపడే పరిస్థితి లేదు. అయినా కూడా కథ అనుసారంగా ఆ సన్నివేశాలు పెట్టినట్లుగా తెలుస్తోంది.

హృతిక్‌ రోషన్‌ లుక్ కి గతంలోనే మంచి మార్కులు పడ్డాయి. ఒరిజినల్‌ పాత్ర కంటే కూడా హృతిక్‌ పోషించబోతున్న పాత్ర నిలిచి పోయేలా ఉంటుందని బాలీవుడ్ లో చర్చ జరిగింది. తాజాగా ట్రైలర్ లో ఆయన లుక్‌ ను చూస్తూ ఉంటే అంతకు మించి అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

గ్యాంగ్ స్టర్ వేద పాత్రలో హృతిక్‌ రోషన్‌ మరియు పోలీస్ ఆఫీసర్ విక్రమ్‌ పాత్రలో సైఫ్‌ అలీ ఖాన్‌ లను ట్రైలర్‌ లో చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా బాలీవుడ్‌ లో ఉన్న అనిశ్చితిని తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ కొందరు బాలీవుడ్‌ వర్గాల వారు మాట్లాడుతున్నారు. ఈ సినిమాలో రాధిక ఆప్టే మరియు యోగిత బిహాని లు హీరోయిన్స్ గా నటించారు.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ లో ఏ స్టార్‌ హీరో వస్తున్నా కూడా బాయ్ కాట్ బ్యాచ్ సోషల్‌ మీడియా హడావుడి చేస్తోంది. ఈ సినిమాకి ఆ ఇబ్బంది తప్పదేమో అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య లాల్ సింగ్ చడ్డా సినిమా ను ఉద్దేశించి హృతిక్‌ రోషన్ పాజిటివ్‌ గా స్పందించాడు. దాంతో ఆ సమయంలోనే కొందరు విక్రమ్‌ వేద ని బాయ్ కాట్‌ చేయాలంటూ పిలుపునిచ్చారు.

ప్రస్తుతానికి ఆ స్థాయిలో మాత్రం బాయ్ కాట్ విక్రమ్‌ వేద వినిపించడం లేదు. కనుక సినిమా మినిమం గా ఆడితే కచ్చితంగా మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. తాజాగా విడుదల అయిన బ్రహ్మాస్త్ర సినిమా విక్రమ్‌ వేద సినిమాకి ఆశలు కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. ట్రైలర్ కి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సినిమా కి మంచి ఓపెనింగ్స్ ఉండే అవకాశం ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View

Tags:    

Similar News