యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ కాస్త గ్యాప్ తర్వాత విక్రమ్ సినిమా ను చేస్తున్నాడు. ఈయన ఇండియన్ 2 సినిమాను విడుదల చేయాలని భావించినా కూడా అందుకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాలేదు. దాంతో ఇండియన్ 2 ను పక్కన పెట్టి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టాడు. విక్రమ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈమద్య కాలంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు తమిళంతో పాటు మొత్తం సౌత్ లో కూడా మంచి పేరు దక్కింది. మాస్టర్ తో పాటు అంతకు ముందు సినిమాల వల్ల లోకేష్ పేరు మారు మ్రోగి పోతుంది.
మాస్టర్ వంటి కమర్షియల్ బిగ్గెస్ట్ సక్సెస్ తర్వాత లోకేష్ చేయబోతున్న సినిమా విక్రమ్ అవ్వడంతో సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కమల్ హాసన్ తో విక్రమ్ ను ఆయన తెరకెక్కిస్తున్నాడు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా విక్రమ్ ను నిలిపేందుకు గాను ఏకంగా నలుగురు విలన్స్ ను ఈ సినిమాలో నటింపజేస్తున్నాడట. ఇప్పటికే మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ ను ఒక విలన్ గా ఎంపిక చేశారు. మరో విలన్ పాత్రకు గాను ఇటీవలే ప్రముఖ నటుడు నరేన్ ను తీసుకున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఇద్దరు స్టార్స్ ను కూడా విలన్ పాత్రలకు తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి.
ఆ ఇద్దరు స్టార్స్ లో ఒకరు విజయ్ సేతుపతి కాగా మరొకరు అర్జున్ దాస్ అంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు మరియు వారిద్దరు మొత్తం నలుగురు విలన్స్ గా ఈ సినిమాలో కనిపించబోతున్న నేపథ్యంలో విక్రమ్ సినిమా చాలా స్పెషల్ గా మారే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ పాత్ర గతంలో ఎప్పుడు చూడని విధంగా ఉంటుందని.. యూనివర్శిల్ స్టార్ నట విశ్వరూపంను మరోసారి ఈ సినిమాలో చూపిస్తారనే నమ్మకంను చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
కమల్ హాసన్ ఒక వైపు రాజకీయాలు.. బుల్లితెర మరియు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఆయన ఇండియన్ 2 సినిమా తిరిగి పునః ప్రారంభం అయ్యే విషయమై చర్చలు జరుగుతున్నాయి. శంకర్ ఈ సినిమా నుండి దాదాపుగా తప్పుకున్నట్లేగా అంటున్నారు. కమల్ ఏమైనా మద్యవర్తిత్వం చేస్తారా అంటే కష్టమే అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇండియన్ 2 ను ముగించాలంటే ఇప్పుడు దర్శకత్వ బాధ్యతలను కమల్ తీసుకోవాల్సిందే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి లైకా వారి అభిప్రాయం ఏంటో చూడాలి.