రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` పై డే బై డే నెగిటివిటీ మరింత పెరిగిపోతుంది. డార్లింగ్ ప్రభాస్ ని చూసి ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న వాళ్లంతా ఒక్కొక్కరుగా విమర్శలతో బయటకొస్తున్న సన్నివేశం కనిపిస్తుంది. రెండు రోజుల క్రితమే హేతువాది బాబుగోగినేని తనదైన శైలిలో సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. జ్యోతిష్యం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన `రాదేశ్యామ్` పై తనదైన శైలిలో జ్యోతిష్యంపై క్లాస్ తీసుకున్నారు. సినిమాని సినిమాగా చూడాలి సార్ అని బ్రతిమలాడినా గోగినేని విడిచిపెట్టలేదు. సందర్భం దొరికినదే తడవ ప్రతాపం చూపించాడు.
తాజాగా ఇప్పుడు కొంతమంది నెటి జనుల వంత్తైంది. `రాధేశ్యామ్` సినిమా చూసిన తర్వాత ప్రజలు జ్యోతిష్యాన్ని నమ్మాలా! వద్దా! అన్న డైలమాలో పడ్డారు. ఒక వేళ జ్యోతిష్యాన్ని నమ్మకపోతే వారి సొంత స్పృహ..సంకల్ప శక్తిని విశ్వసించాలి. ఎవరికైనా విపరీతమైన సంకల్ప బలం ఉంటే జ్యోతిష్యుడి అంచనా కూడా తప్పు అవుతుందని `రాధేశ్యామ్` సినిమాలో చూపించారు. కాబట్టి ఇక్కడ జ్యోతిష్యం-సంకల్పం మధ్య కొంత మందికి గందరగోళం ఏర్పడుతుందని నెటి జనులు కామెంట్లు చేస్తున్నారు.
ఓ అడుగు ముందుకేసి `జస్టిస్ ఫర్ తాషా` అంటూ ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనికి దిగేలా కనిపిస్తున్నారు. `రాధేశ్యామ్` లో విక్రమాదిత్య (ప్రభాస్) మొదట తాషా అనే విదేశీ అమ్మాయి ప్రేమలో పడతాడు. కానీ విధి రాత ప్రకారం ఎంతో కాలం ప్రేమ ఉండదు కాబట్టి ఆమెకు దూరంగా వెళ్లి కొన్నాళ్లకి జ్యోతిష్యం అంటే నమ్మని ప్రేరణ(పూజాహెగ్డే) ప్రేమలో పడతాడు. ప్రేరణ కూడా ప్రేమిస్తుంది. కానీ ప్రేరణ ఎంతో కాలం బ్రతకదని తెలుస్తుంది.
కానీ విక్రమాదిత్య ఆమె చేయి చూసి బ్రతుకుందని చెబుతాడు. సంకల్ప శక్తి ద్వారా ఇది సాధ్యమవుతుంది. సరిగ్గా ఈ పాయింట్ ని పట్టుకునే నెటి జనులు బాబు గోగినేని స్టైల్లో చెలరేగిపోతున్నారు. అంత సంకల్పం తాషా విషయంలో ఎందుకు కనిపించలేదు? ప్రేరణ విషయంలోనూ ఎందుకంత బలమైన సంలక్పం? అంటూ ప్రశ్నిస్తున్నారు.
విక్రమాదిత్యకు ప్రేమ జీవితం ఉంటే ఆ ప్రేమని మొదట తాషాకే పంచాలంటున్నారు. `జస్టిస్ ఫర్ తాషా` అనే మీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. వీటిని చిత్ర యూనిట్ కూడా లైట్ తీసుకుంది. సినిమాపై వచ్చే మీమ్స్ ని బృందం కూడా ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తుంది.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా విజువల్ ట్రీట్ గా ఓ వర్గం ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటుంది. అయితే మెజార్టీ వర్గం సినిమా విషయంలో పెదవి విరిచేయడంతో వసూళ్లు పడిపోయాయి. థియేటర్లో సినిమా ఇంకా రన్నింగ్ లో ఉంది. మార్చి 25 న మరో పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ వరకూ `రాదేశ్యామ్` ని థియేటర్లలో ఆడిస్తారు. `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ డే రోజున చిత్రాన్ని తొలగించే అవకాశం ఉంది. `రాధేశ్యామ్` ఓవర్సీస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. అమెరికా సహా బాలీవుడ్ లో మంచి వసూళ్లు సాధిస్తుందని యూనిట్ నమ్మకం పెట్టుకున్నా వమ్ము తప్పలేదు.