సినిమాలకు పేర్లు పెట్టడం ఓ కళ.. అది అందరికీ రాదు.. కొత్త ట్రెండ్ సృష్టించే దర్శకులు ఉన్నారు.. పాత మూసధోరణితో వెళ్లే వాళ్లు ఉన్నారు. నవతరం దర్శకులను చూసుకుంటే త్రివిక్రమ్ అచ్చ తెలుగు పదాలను వెతికి పెడతాడు.. ఇక మన బ్లాక్ బస్టర్ దర్శకుడు జక్కన్న ఎప్పుడూ హీరో పేరునే సినిమా టైటిల్ గా పెడతాడు.. సింహాద్రి - మర్యాదరామన్న - బాహుబలి - ఈగ ఇలా టైటిల్ రోల్ లో ఏది ఉంటే అదే సినిమా పేరు..
ఇక్కడో తమిళ సినిమాకు వింతైన టైటిల్ ను పెట్టారు. తమిళ హీరో విమల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు’ (ఇతనికి ఎక్కడో మచ్చ ఉంది) అనే టైటిల్ ఖరారు చేశారు. ఆషా జవేరి హీరోయిన్ గా చేస్తోంది. ఏఆర్ ముఖేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సాయి ప్రొడక్షన్స్ పతకాంపై చార్మిళ మాన్రే - ఆర్. సావంత్ కలిసి నిర్మిస్తున్నారు.
చార్మిళ మాన్రే కన్నడంలో పెద్ద హీరోయిన్. ఆమెను హీరోయిన్ గా పరిచయం చేసింది ఏఆర్ ముఖేషే.. అందుకే అతడి దర్శకత్వంలోనే తొలి సినిమాను నిర్మాతగా తీస్తోంది. అయితే రోటీన్ భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ టైటిల్ పెట్టినట్టు చార్మిళ మాన్రే తెలిపింది. ప్రేక్షకులను థియేటర్స్ రప్పించాలంటే కొత్తదనం ఉండాలని పేర్కొంది. మరి ఈ కొత్తదనం ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో చూడాలి మరి..