మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన `రంగస్థలం` ఇండస్ట్రీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. నాన్ బాహుబలి కేటగిరీలో ఈ చిత్రం ఇండస్ట్రీ బెస్ట్ రికార్డుల్ని అందుకుంది. దాదాపు 200కోట్ల గ్రాస్ - 120కోట్ల షేర్ వసూళ్లతో చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డుల్ని `వినయ విధేయ రామా` బ్రేక్ చేస్తుందా? అంటూ ఆర్ సీ ఫ్యాన్స్ లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మళ్లీ చరణ్ తెలుగు రాష్ట్రాలతో పాటు - ఇరుగుపొరుగునా ఆ స్థాయి రికార్డులు అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
`వినయ విధేయ రామా` చిత్రానికి ఇది పెద్ద ప్లస్ గా మారిందిట. దీంతో ఏరియా వైజ్ రైట్స్ అమ్మకాల్లోనూ భారీ క్రేజు నెలకొంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కీలక ఏరియాల హక్కుల్ని భారీ మొత్తాలకు విక్రయించారన్న సమాచారం ఉంది. తాజా సమాచారం ప్రకారం.. `వినయ విధేయ రామా` కేరళ హక్కులకు భారీ పోటీ నడుమ విక్రయించారని తెలుస్తోంది. వీవీఆర్ డిస్ట్రిబ్యూటర్స్ తో కలిసి కేరళకు చెందిన ప్రకాష్ ఫిలింస్ సంస్థ వినయ విధేయ రామా హక్కుల్ని చేజిక్కించుకుంది. అలాగే రంగస్థలం ని మించి మలయాళ డబ్బింగ్ వెర్షన్ ని కేరళలో రిలీజ్ చేసేందుకు సదరు సంస్థ ప్లాన్ చేస్తోందిట. రంగస్థలం ఎఫెక్ట్ తో ఆర్ సి 12కి పెద్ద మొత్తాన్నే చెల్లిస్తున్నారట.
చరణ్‌కి మగధీర తర్వాత కేరళలోనూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆ తర్వాత చరణ్ నటించిన చాలా మాస్ సినిమాలు అక్కడా హిట్లు కొట్టాయి. ఇటీవల `రంగస్థలం` చిత్రంతో చెర్రీ క్రేజు మల్లూ బాబుల్లో అమాంతం పెరిగింది. అందుకే ఇప్పుడు `వినయ విధేయ రామా` టెన్షన్ అక్కడ లోకల్ రిలీజ్ లకు ఉండనుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరిలో `వినయ విధేయ రామా` ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. మొత్తానికి చెర్రీ మలయాళీల్లో అంతకంతకు క్రేజు పెంచుకుంటూ దూసుకుపోవడంపైనా మెగా ఫ్యాన్స్ లో చర్చ సాగుతోంది.