ఎవరెన్ని చెప్పినా కూడా అక్టోబర్ 22న 'అఖిల్' రిలీజ్ అవ్వకపోవడానికి చాలా రూమర్లు వింటూనే ఉన్నాం. అయితే కింగ్ నాగార్జునకు గ్రాఫిక్స్ సన్నివేశాలు నచ్చకపోవడానికే కారణం అని ఇప్పటికే విన్నాం. బాహుబలి తరువాత గ్రాఫిక్సు విషయంలో కాంప్రమైజ్ కాలేం అంటూ నాగ్ చెప్పిందే నిజమేనంటూ ఈరోజు మరోసారి చెప్పాడు దర్శకుడు వివి వినాయక్. అసలు అఖిల్ లేటవ్వడానికి కారణమైన ఆ సీన్ గురించి కూడా చెప్పేశాడు.
''క్లయమ్యాక్స్ లో ఈ సినిమాలో ఒక ఫ్లయిట్ చేజ్.. కూలిపోయి.. పేలిపోయే.. సీక్వెన్స్ ఒకటుంది. ఆ పార్టు మొత్తం మనం అనుకున్నంత బాగా రాలేదు. గ్రాఫిక్స్ నాసిరకంగా వచ్చాయి. దానితో మళ్లీ వాటిని చేయించాము. హైదరాబాద్ కు చెందిన డి.క్యూ. ఎంటర్ టైనమెంట్ అనే కంపెనీ.. నా ఫ్రెండ్ యుగందర్ రంగంలోకి దిగి.. ఆ సీక్వెన్సంతా బాగా చేశాడు. ఇప్పుడు అదిరిపోయింది'' అంటూ వివరించాడు వినాయక్. అయితే సినిమాను పోస్టుపోన్ చేయడానికి చాలా వర్రీ అయ్యారట అందరూ. కాని అప్పుడు నాగ్ వీరికి బలం ఇచ్చారు.
''నిజానికి మేం సినిమాను పోస్టుపోన్ చేయాలంటే చాలా భయపడ్డాం. కాని నాగార్జున గారు మా వెనుకే ఉండి ధైర్యమిచ్చారు. దానికేముంది ఒక 10 రోజులు లేటవుతుంది. మీరు క్వాలిటీ అవుట్ పుట్ నే బయటకు రిలీజ్ చేయండి అంటూ మా వెన్నంటే నిలిచారు'' అంటూ నాగ్ ఇచ్చిన ధైర్యంతో సినిమాను పోస్టుపోన్ చేశామని వినాయక్ చెప్పాడు. మొత్తానికి ఫ్లయిట్ గ్రాఫిక్సు ఎంత పని చేశాయండీ.. లేకపోతే ఈపాటికి అఖిల్ రిలీజ్ అయ్యి రెండు వారాలు అయిపోయేదే!!