‘బాహుబలి: ది బిగినింగ్’ హిట్టవుతుందనుకున్నారు కానీ.. మరీ ఆ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. పైగా ఈ సినిమాకు మొదట్లో టాక్ కొంచెం మిక్స్డ్ గా రావడం కూడా తెలిసిన విషయమే. సినిమాను మధ్యలో ముగించడంపై ఓ వర్గం ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా కొన్ని అభ్యంతరాలు కూడా లేవనెత్తారు. అయినా ఆ ప్రతికూలతలన్నీ దాటుకుని సినిమా అఖండ విజయం సాధించింది. ఐతే సినిమాలో ఎన్నెన్నో సందేహాలుండగా.. అంత పెద్ద హిట్ ఎలా అయిందో అంటూ ఆశ్చర్యపోయాడట స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్. స్వయంగా ప్రభాస్ దగ్గరే వినాయక్ ఈ విషయమై ఆశ్చర్యం వ్యక్తం చేశాడట.
‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలైన కొన్ని రోజులకు తాను వినాయక్ ను కలిశానని.. ఆయన ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లను చూసి ఆశ్చర్యపోయాడని ప్రభాస్ తెలిపాడు. శివగామి ఎందుకు చనిపోయింది.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు.. దేవసేన ఎందుకు చెరసాలలో ఉంది.. ఇలా పదికి పైగా ప్రశ్నలు కనిపించాయట వినాయక్ కు సినిమాలో. ఇన్ని ప్రశ్నలున్న సినిమా ఎలా అంత పెద్ద విజయం సాధించిందంటూ ప్రభాస్ ను ప్రేశ్నించాడట వినాయక్. ఆయన చెప్పే వరకు తనకు కూడా సినిమాలో ఇన్ని సందేహాలున్న సంగతి అర్థం కాలేదని.. అయినప్పటికీ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేశారంటే ప్రేక్షకులు తమ మీద ఎంత ప్రేమ చూపించారో అర్థమైందని ప్రభాస్ అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/