రాజమౌళి దగ్గర శిష్యరికం చేసి ‘బాహుబలి: ది బిగినింగ్’కు కూడా పని చేసిన పళని దర్శకుడిగా మారుతూ తీసిన తొలి సినిమా ‘ఏంజెల్’. ‘వినవయ్యా రామయ్యా’తో హీరోగా పరిచయమైన నాగ అన్వేష్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. హెబ్బా పటేల్ కథానాయిక. నాగ అన్వేష్ తండ్రి ‘సింధూర పువ్వు’ కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఎప్పుడో పూర్తయినప్పటికీ విడుదలకు సరైన ముహూర్తం కుదరట్లేదు. గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం మీద కొంచెం ఎక్కువగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగా బిజినెస్ జరక్కపోవడం.. చాలినన్ని థియేటర్లు దొరక్కపోవడంతో రిలీజ్ లేటవుతోంది.
ఐతే జులైలో ఎలాగైనా సినిమాను రిలీజ్ చేయాలని చూస్తోంది ‘ఏంజెల్’ టీం. ఈ మధ్య ఈ చిత్రం వార్తల్లో లేని నేపథ్యంలో తాగా చిత్ర బృందం ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఈ సందర్భంగా తమ సినిమా గురించి గొప్పగా చెప్పుకునే ప్రయత్నంలో స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ పేరును వాడుకుంది. మూడు నెలల కిందటే సినిమా పూర్తయిందని.. గ్రాఫిక్స్ పనుల కోసం ఆలస్యమైందని.. మధ్యలో వినాయక్ కు ప్రివ్యూ వేసి చూపించామని.. ఆయన సినిమా బాగా నచ్చిందని.. ఐతే తాను చూసిన ఓ హాలీవుడ్ సినిమాలోంచి ఒక ఎపిసోడ్ చెప్పి.. దాన్ని గ్రాఫిక్స్ రూపంలో సృష్టించి సినిమాకు జోడించమని సలహా ఇచ్చారని.. ఆయన చెప్పినట్లే చేశామని.. సినిమాకు అది ప్లస్సయిందని నిర్మాత తెలిపాడు. ఐతే వినాయక్ ఏదో సలహా ఇస్తే.. దాన్ని పాటించి గుట్టుగా ఉంచాలి కానీ.. ప్రెస్ మీట్లో ఆ విషయం చెప్పడం ద్వారా వినాయక్ మీద జనాలకు మరో అభిప్రాయం కలిగేలా చేయడం సమంజసమేనా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/