వైరల్‌ పిక్‌ : గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఆనందంలో ఉపాసన అండ్ లక్ష్మీ ప్రణతి

Update: 2023-01-11 06:56 GMT
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న నేపథ్యంలో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఆ సినిమాకు సంబంధించిన విషయాలు మరియు ఆ సినిమాలో హీరోలుగా నటించిన రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్ ల యొక్క ఫొటోలు ఇంకా ఇతర విషయాల గురించి తెగ చర్చ జరుగుతోంది.

ఈ సమయంలో రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్ లయ ఒక్క సతీమణుల యొక్క ఫొటో వైరల్‌ అవుతోంది.

గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుక సందర్భంగా ఉపాసన మరియు లక్ష్మీ ప్రణతి సందడి చేశారు. ఉపాసన చీర కట్టులో ఆకట్టుకోగా.. లక్ష్మీ ప్రణతి మోడ్రన్ డ్రెస్ లో సందడి చేశారు.

రామ్ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ ల సరసన వారు ఉన్న ఫొటోలు కూడా వైరల్‌ అయ్యాయి. ఆ ఫొటోలు కాకుండా ఉపాసన మరియు లక్ష్మి ప్రణతి తీసుకున్న సెల్ఫీ వైరల్‌ అయ్యింది.

లక్ష్మీ ప్రణతి ఈ సెల్ఫీ ని తీశారు. సోషల్ మీడియాలో ఇద్దరు స్టార్స్ వైప్స్ అంటూ ఈ సెల్ఫీ ట్రెండ్ అవుతోంది.

ఉపాసన సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా ఏదో ఒక ఫొటో లేదా వీడియోను షేర్‌ చేస్తూ ఉంటారు. కానీ లక్ష్మీ ప్రణతి ఫొటోలు చాలా రేర్‌ గా ఉంటాయి. ఆర్ఆర్ఆర్ వేడుక నేపథ్యంలో లక్ష్మీ ప్రణతి ఈమధ్య కాలంలో రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి కనిపించడం అరుదైన పిక్ గా నిలిచి పోయే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News