జెన్నీపై కన్నేసిన విరాట్ కోహ్లీ!!

Update: 2017-04-12 22:30 GMT
టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆటలో ఏ రేంజ్ లో రెచ్చిపోతాడో.. పర్సనల్ లైఫ్ లో అంతకంటే యాక్టివ్ అనే విషయం తెలిసిందే. బ్రాండ్ అండార్స్ మెంట్స్ తో పాటు.. ప్రేమకథను జోరుగా నడిపించేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మతో అఫైర్ విషయాన్ని.. సీక్రెట్ గా ఉంచేందుకు ప్రయత్నించకపోవడం విశేషం.

విరాట్ కోహ్లీ కన్ను టాలీవుడ్ అండ్ బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా జెనీలీయా డిసౌజాపై పడింది. ఆమెతో డేటింగ్ కూడా చేశానంటున్నాడు. ఇది ఇప్పుడు కాదు లెండి.. కొన్నేళ్ల క్రితం కథ ఇది. అప్పట్లో విరాట్ ఇంకా యంగ్ క్రికెటర్ మాత్రమే. అప్పట్లో విరాట్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జెన్నీపై మనసు పారేసుకున్న విషయాన్ని ఓపెన్ గానే చెప్పాడు విరాట్. జెనీలియా చాలా అందంగా ఉంటుందని.. ఆమె అంటే తనకు చాలా ఇష్టమని అన్న కోహ్లీ.. జెన్నీతో కాసేపు డేటింగ్ చేశానని.. కాసేపు ఆమెను దగ్గర నుంచి చూడగానే సిగ్గుతో అక్కడి నుంచి  పారిపోయానని చెప్పాడు.

అప్పట్లో జెన్నీపై మనసు పడ్డానంటూ విరాట్ కోహ్లి ఇచ్చిన పాత ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్ వైరల్ గా స్ప్రెడ్ అవుతోంది. అయితే.. అప్పటికే జెనీలియా- రితేష్ దేశ్ ముఖ్ లు ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సంతానం కూడా కనేశారు. ఆ తర్వాత అనుష్క శర్మతో లవ్ లో పడ్డాడు విరాట్. ఈ ఇంటర్వ్యూపై అనుష్క రియాక్షన్ ఎలా ఉంటుందనే విషయమే ఇప్పుడు అందరిలో ఆసక్తి కలిగిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News