టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంత కాలం కమర్షియల్ యాడ్స్ తో బుల్లి తెరకు పరిమితం అయిన విషయం తెల్సిందే. అయితే విరాట్ త్వరలో వెండి తెరపై కనిపించేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటి వరకు చిన్న చిన్న యాడ్ ఫిల్మ్ - కమర్షియల్ యాడ్స్ లో కనిపించిన విరాట్ ఒక ఫుల్ లెంగ్త్ మూవీలో హీరోగా కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా విరాట్ కోహ్లీ ప్రకటించాడు. నేడు ఉదయం సోషల్ మీడియా ద్వారా తాను హీరోగా నటిస్తున్న సినిమాకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ విషయాన్ని మీకు చెప్పాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ విరాట్ కోహ్లీ ఈ పోస్టర్ ను పోస్ట్ చేశాడు.
10 సంవత్సరాల తర్వాత మరో కొత్త రంగంలో అడుగు పెట్టబోతున్నట్లుగా కూడా విరాట్ పేర్కొన్నాడు. ‘ట్రైలర్’ అనే చిత్రంతో విరాట్ కోహ్లీ హీరోగా పరిచయం కాబోతున్నాడు. వ్రాంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రంకు సంబంధించిన ఇతర వివరాలు ఏవీ కూడా బయటకు రాలేదు. కనీసం ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు అనే విషయంలో కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈనెల 28న ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లుగా విరాట్ ప్రకటించాడు. ట్రైలర్ విడుదల సమయంలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెళ్లడి చేసే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
అనూహ్యంగా విరాట్ కోహ్లీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లుగా ప్రకటించడం ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మను వివాహం చేసుకున్న విరాట్ కోహ్లీ ఒక వైపు టీం ఇండియా కెప్టెన్ గా వ్యవహరిస్తూనే మరో వైపు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. విరాట్ కోహ్లీ హీరోగా ఎంట్రీ ఇవ్వడం వల్ల ఆయన ఆటపై ప్రభావం పడే అవకాశం ఉందని కూడా కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి విరాట్ కోహ్లీ హీరోగా తెరకెక్కుతున్న ‘ట్రైలర్’ మూవీ దేశ వ్యాప్తంగా చర్చకు తెర లేపుతోంది.