ప్రస్తుతం సెలబ్రెటీలకు మంచి ఆదరణ దక్కితే జూనియర్ సీనియర్ అని తేడా లేకుండా పురస్కారాలు అందుతున్నాయి. ఇక మరికొన్ని ప్రయివేట్ సంస్థలు అరుదైన గుర్తింపును ఇస్తున్నాయి. ప్రస్తుతం ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ఓ ప్రముఖ సంస్థ నుంచి మంచి గౌరవం దక్కింది. ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో డూప్లికెట్ కోహ్లీ కొలువుదీరాడు. అంటే అతని మైనపు బొమ్మను స్థాపించారు.
కోహ్లీ మాదిరిగానే ఆ విగ్రహం ఉండడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. కోహ్లీ అగ్రెసివ్ బ్యాట్స్ మెన్ గా మారితే ఎలా ఉంటుందో ఆ మైనపు బొమ్మ అలా ఉంది. దూరం నుంచి ఓ నిమిషం చుస్తే కోహ్లీ మన ఎదురుగా బ్యాట్ పట్టుకొని ఉన్నాడని ఆశ్చర్యపోకుండా ఉండలేము. ఇక తనతో సెల్ఫీ దిగాలంటే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకి వెళ్లండి అంటూ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా మెస్సేజ్ ఇచ్చాడు.
దీంతో అభిమానులు కొహ్లీ మైనపు బొమ్మను చూసేందుకు టుస్సాడ్స్ మ్యూజియంకి వెళుతున్నారు. ఇక ఇదే మ్యూజియంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ విగ్రహం కూడా ఉంది. విరాట్ వన్డే జెర్సీలో ఉంటే.. సచిన్ టెస్టు జెర్సీలో కనిపిస్తున్నాడు. అందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సెల్ఫీలు దిగుతున్న జనాలు సేమ్ నిజమైన ఆటగాళ్లతో ఫొటో దిగినట్లే ఉందని చెబుతున్నారు.