టాలీవుడ్లో సాయిపల్లవికి గల క్రేజ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. సాయిపల్లవి ఉంటే చాలు .. ఆ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం బలపడిపోయింది. ఇంతకుముందు ఆమె చేసిన 'లవ్ స్టోరీ' .. 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలు భారీ విజయాలను సాధించాయి. ఈ నేపథ్యంలో 'విరాటపర్వం' సినిమా విడుదలకి ముస్తాబైంది. రానా - సాయిపల్లవి కలిసి నటించిన ఈ సినిమాకి వేణు ఉడుగుల దర్శకత్వం వహించాడు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా వరంగల్ లో నిర్వహించిన 'విరాటపర్వం ఆత్మీయ వేడుక' కార్యక్రమంలో సాయిపల్లవి మాట్లాడుతూ .. " ఈ సినిమా కోసం వరంగల్ రావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. వరంగల్ వస్తే నా ఇంటికి వచ్చినట్టుగానే ఉంటుంది. ఇంతకు ముందు 'శ్యామ్ సింగ రాయ్' సినిమాకి కూడా వచ్చాను.
ఇంతే ప్రేమతో అప్పుడు కూడా ఆదరించారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్లను గురించిన కథ ఇది. ఇక మనం కాకపోతే ఎవరు ఆదరిస్తారు ఆలోచించండి? అందరూ కూడా ఇది మన సినిమా అనుకుని వెళ్లి చూడండి.
ఇది కొంతకాలం క్రితానికి సంబంధించిన కథ. అప్పటి పరిస్థితులపై .. ప్రేమపై పోరాడే కథ. కొత్తగా ఒక ప్రయోగం చేసినప్పుడు సరైన ప్రోత్సాహం లేకపోతే మళ్లీ అలాంటి ప్రయత్నాలు చేయాలనే ఉత్సాహం రాదు. అలా కొత్తగా చేసిన ఈ సినిమాను మీరంతా ఆదరిస్తారని నేను భావిస్తున్నాను.
ఇలాంటి ఒక మంచి సినిమాను నాకు ఇచ్చినందుకు నేను వేణు గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. తాను ఈ జిల్లాకి చెందిన వ్యక్తి .. అందువలన ఈ ఊరి బ్లెస్సింగ్స్ కోసం వచ్చారు. తాను ఈ సినిమాను మీకు అంకితం చేస్తున్నారు.
ఈ సినిమాలో చేసే అవకాశం నాకు వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను. మీ ప్రేమకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ కథ ద్వారానే నేను నా ప్రేమను వ్యక్తం చేస్తున్నాను అనుకోండి. నా ప్రేమను మీరు థియేటర్స్ కి వచ్చి తీసుకుంటే నేను సంతోషిస్తాను. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. మీరంతా తప్పకుండా వచ్చి చూస్తారని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.