దగ్గుబాటి రానా కథానాయకుడిగా వేణు ఉడుగల దర్శకత్వంలో డి.సురేష్ బాబు నిర్మించిన చిత్రం `విరాటపర్వం`. నక్సలిజం..ఉద్యమం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న చిత్రమిది. ఎక్కువ భాగం షూటింగ్ నల్లమల ఆడవుల్లోనే జరిగింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాకి మంచి బజ్ ని తీసుకొచ్చాయి. అయితే ఈ సినిమా ప్రారంభమై చాలా కాలమవుతోంది. ఇప్పటికే రిలీజ్ కూడా అవ్వాలి. కానీ `విరాటపర్వం` రిలీజ్ మాత్రం ఇంకా జరగలేదు. మధ్యలో కొవిడ్ కారణంగా కొంత సమయం వృధా అయినప్పటికీ అసలు సమస్య అంతా దర్శకుడి కారణంగానేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల కోసం రీషూట్ కి వెళ్లినట్లు గతంలో వార్తలొచ్చాయి. సన్నివేశాల్లో పర్పెక్షన్ మిస్ అవ్వడంతోనే రీషూట్ కి వెళ్లాల్సి వచ్చిందని అప్పట్లో ప్రచారం సాగింది. అయితే అసలు సంగతి అది కాదనేది తాజా గుసగుస. ఈ సినిమా కోసం దర్శకుడు ఎంపిక చేసుకున్న ఉచ్ఛారణ (భాష యాస) తప్పిదంగా కనిపిస్తోందిట. సినిమా అంతా తెలంగాణ స్లాంగ్ లో ఉంటుంది. మరీ ఇప్పటి జనాలకి అర్థం కాని విధంగా అందులో డైలాగులు ఉన్నాయని నేటి జనరేషన్ తెలంగాణ ప్రజలకే అర్థం కానంత స్లాంగ్ ని డైలాగుల్లో ఉపయోగించారట. ఇది సురేష్ బాబుకి ఎంత మాత్రం నచ్చలేదుట. మొత్తం డైలాగులు మార్చమని..అందరికీ అర్థమయ్యే తెలంగాణ స్లాంగ్ లో ఉండాలని నిపుణులు సూచించారుట.
ఈ నేపథ్యంలో దర్శకుడు మళ్లీ మరో వైర్షన్ డైలాగులు రాసుకుని..అవసరం మేర రీషూట్ చేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమాని థియేటరలో కాకుండా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని సురేష్ బాబు నిర్ణయించారని ..నెట్ ప్లిక్స్ తో డీల్ కుదిరిందని తెలుస్తోంది. `విరాటపర్వం` ఓటీటీ లో విజయం సాధిస్తుందని సురేష్ బాబు భావించినట్టు ఓ గుసగుస ఫిలింనగర్ లో వినిపిస్తోంది.