హాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి - సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ''విరాట పర్వం''. వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన కంటెంట్ ఆధారిత సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలలో రానా - సాయి పల్లవి కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - సినిమా టీజర్ - ఫస్ట్ సింగిల్ 'కోలు కోలు' కి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.
1990లలో జరిగిన యదార్థ సంఘటనల ప్రేరణతో, నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో 'విరాటపర్వం' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో అరణ్య అనే కలం పేరుతో పిలవబడే కామ్రేడ్ రవన్న పాత్రలో రానా కనిపించనున్నారు. అతని అభిమాని వెన్నెల పాత్రను సాయి పల్లవి పోషించింది. ఇది యుద్ధం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథ అని చిత్ర బృందం తెలిపింది.
నేడు రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా ‘ది వాయిస్ ఆఫ్ రవన్న’ అనే పేరుతో ఓ స్పెషల్ గ్లిమ్స్ ని మేకర్స్ ఆవిష్కరించారు. రానా - సాయి పల్లవిల ప్రయాణం మరియు యుద్ధంలో వారి ప్రేమకథను ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేశారు. బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇందులో రానా ఇచ్చిన పవర్ ఫుల్ స్పీచ్ ఆకట్టుకుంటోంది.
“మారదులే.. ఈ దోపిడి దొంగల రాజ్యం మారదులే... రౌద్రపు శత్రువు దాడిని ఎదురించే పోరాటం మనదే... చలో... చలో... చలో పరిగెత్తు... అడుగే పిడుగై రాలేలా, గుండెల దమ్ముని చూపించు.. చలో.. చలో పరిగెత్తు... చీకటి మింగిన సూర్యుని తెచ్చి తూర్పు కొండను వెలిగిద్దాం… చలో... చలో పరిగెత్తు... ఒంగిన వీపుల బరువును దించి, విప్లవ గీతం వినిపిద్దాం.. చలో.. చలో పరిగెత్తు.. దొరల తలుపుల తాళంలా... గడీల ముంగట కుక్కల్లా... ఎన్నాళ్లు ఇంకెన్నాళ్లు.. చలో పరిగెత్తు.. చలో పరిగెత్తు..” అంటూ సాగిన ఈ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
'విరాటపర్వం' చిత్రాన్ని డి. సురేష్ బాబు సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు. డానీ సాంచెజ్ లోపెజ్ - దివాకర్ మణి సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. దీనికి శ్రీ నాగేంద్ర ప్రొడక్షన్ డిజైనర్. స్టీఫెన్ రిచర్డ్ - పీటర్ హెయిన్ ఫైట్స్ కంపోజ్ చేయగా.. రాజు సుందరం డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు.
ఈ చిత్రంలో ప్రియమణి - నందితా దాస్ - నవీన్ చంద్ర - జరీనా వహాబ్ - ఈశ్వరీ రావు మరియు సాయి చంద్ ముఖ్య పాత్రల్లో నటించారు. బెనర్జీ - నాగినీడు - రాహుల్ రామకృష్ణ - దేవి ప్రసాద్ - ఆనంద్ రవి - ఆనంద్ చక్రపాణి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. 'విరాటపర్వం' సినిమా ట్రైలర్ ను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఇదే క్రమంలో విడుదల తేదీని కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
Full View