#షూట్ ర‌ద్దు! భీమ్లా నాయ‌క్ ను వెంటాడిన‌ వైర‌స్?

Update: 2022-01-16 04:27 GMT
కోవిడ్ వ‌ల్ల ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల కంటే సినీప‌రిశ్ర‌మ తీవ్రంగా ప్ర‌భావితం అయిన సంగతి తెలిసిందే. రెండేళ్లుగా వైర‌స్ భూతం వ‌దిలి పెట్ట‌డం లేదు. మూడో వేవ్ లో క‌రోనా ప్రభావం మ‌రింత‌గా క‌నిపిస్తోంది. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ అత్యంత వేగంగా విస్తరిస్తూ భ‌య‌పెడుతోంది. ఇక క‌రోనా వ‌ల్ల షూటింగుల‌కు పెను ముప్పు త‌ప్ప‌డం లేదు. చిత్ర‌బృందంలో ఎవ‌రో ఒక‌రికి క‌రోనా సోకుతుండ‌డంతో షూటింగ్ ని నిలిపివేసే ప‌రిస్థితి నెల‌కొంది. యూనిట్ లోని ఒకరికి లేదా అంత‌కుమించి స‌మూహానికి వైర‌స్ సోక‌డం బెంబేలెత్తిస్తోంది. ఇటీవ‌ల దాదాపు అన్ని సినిమాల‌ షూట్ లు ఆగిపోయాయి. ఆచార్య- సర్కారు వారి పాట యూనిట్ సభ్యులకు కోవిడ్ సోకిన సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ కి కరోనా పాజిటివ్ వ‌చ్చింది. దీనితో షూటింగ్ ల‌ను ఆపేసారు.

నిర్మాత నియమించిన ప్రైవేట్ హెల్త్ ఏజెన్సీ ద్వారా యాధృచ్ఛిక పరీక్షలు నిర్వహించినప్పుడు.. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ యూనిట్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీనివ‌ల్ల ప్ర‌స్తుతం తెర‌కెక్కించాల్సిన‌ పాటల షూటింగును రద్దు చేసార‌ని తెలిసింది. లేకుంటే చిత్రం మొత్తం షూటింగ్ భాగాన్ని పూర్తి చేయ‌గ‌లిగేద‌ని తెలుస్తోంది. మరోవైపు ఈ చిత్రం విడుదల తేదీని సంక్రాంతి నుండి నిరవధికంగా వాయిదా వేయడంతో షూటింగ్ పూర్తయిన తర్వాత నిర్మాత ఈ మూవీ  కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మహమ్మారి తగ్గిన తర్వాతే ఏదైనా సాధ్య‌మ‌ని అర్థ‌మ‌వ‌తోంది. దర్శకుడు శేఖర్ చంద్ర - త్రివిక్రమ్.. బృందం ఎడిటింగ్ లో బిజీగా ఉన్నార‌ని తెలిసింది. కోవిడ్ విల‌యం ఈ వేస‌వి వ‌ర‌కూ ఇబ్బంది పెడుతుందా లేక తొంద‌ర‌గానే అంత‌మ‌వుతుందా? అన్న‌ది తేల‌ని గంద‌ర‌గోళం నెల‌కొంది.
Tags:    

Similar News