టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి బాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క శర్మలు మరోసారి తమ పెద్ద మనసును చాటుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే విరుష్క ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తుంది. మరోసారి తమ దాతృత్వం చాటుకొని అభిమానులు గర్వించేలా చేసింది ఆ జంట. విరాట్, అనుష్కల సాయం పట్ల ట్విట్టర్ లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఆయాన్ష్ గుప్తా అనే రెండేళ్ల చిన్నారి వెన్నెముకకు సంబంధించిన ఓ వ్యాధితో బాధపడుతున్నాడు. చిన్నారిని కాపాడడానికి అతి ఖరీదైన జోల్గెన్స్ మా అనే మందులు అవసరమయ్యాయి. అందుకు రూ.16 లక్షలు అవసమరని వైద్యులు తెలిపారు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ పసివాడి తల్లిదండ్రులు ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు. 'ayaanshfightsSMA' పేరిట ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.
ఆయాన్ష్ చికిత్సకు అవసరమైన రూ.16 లక్షలు పోగయ్యాయని చిన్నారి తల్లిదండ్రులు ట్విట్టర్ వేదికగా సోమవారం ప్రకటించారు. ఈ కార్యక్రమం ఇంత త్వరగా ముగుస్తుందని అనుకోలేదని అన్నారు. సాయం చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వారు ఎంత సాయం చేశారో చెప్పలేదు కానీ విరుష్కకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ట్వీట్ చేశారు.
అభిమానులుగా మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తామని విరుష్కను ఉద్దేశించి అన్నారు. తాము ఊహించినదానికన్నా ఎక్కువగా సాయం చేశారని కొనియాడారు. తమ జీవితంలో కఠినమైన ఈ మ్యాచ్ ను సిక్స్ తో గెలవడానికి సాయం చేశారని అన్నారు. విరుష్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరో ట్వీట్ చేశారు. చిన్నారి వైద్య సాయం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.