విశాల్‌- వ‌రూ.. వాటీజ్‌ హ్యాపెనింగ్‌?

Update: 2018-09-30 04:26 GMT
`పందెంకోడి 2` థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ లాంచ్ చేసిన‌ సంగ‌తి తెలిసిందే. ఏడు రోజుల పాటు జ‌రిగే జాత‌ర‌లో ఏం జ‌రిగింది? అన్న‌దే ఈ సినిమా క‌థ. ఆ ఏడు రోజుల జాత‌ర‌లో ఎవ‌రు ఎవ‌రిని ఆడుకున్నారు? ఎవ‌రి కుత్తుక తెగింది? శ‌త్రువును పందెంకోడి ఎలా వేటాడింది.. చివ‌రికి జాత‌ర‌లో పందెం గెలిచిందెవ‌రు? అన్న‌దే ఈ సినిమా క‌థాంశం. ఈ క‌థ‌లో విశాల్ వ‌ర్గం - ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం మ‌ధ్య పోరాటం ఏంటి? ఈ మ‌ధ్య‌లో ల‌వ్ గేమ్ ఏంటి అన్న‌ది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్‌. కీర్తి సురేష్ జాత‌ర‌లో గాజులు - ఛ‌మ్కీలు కొనుక్కోవ‌డానికి వ‌చ్చిన గ‌డుసు పిల్ల అనుకుంటే - వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌ కుమార్ క‌థేంటి?

విశాల్ వ‌ర్గంపై క‌త్తి నూరే అరివీర‌భ‌యంకర విల‌న్ వ‌ర‌ల‌క్ష్మి. ఆ సంగ‌తి నిన్న ట్రైల‌ర్‌ లో వ‌రూ క‌త్తి నూరుడు చూసి చెప్పొచ్చు. ఒకేసారి రెండు చేతుల్లోకి రెండు క‌త్తులు అందుకుని కొర‌కొరా నీలాంబ‌రి-ర‌మ్య‌కృష్ణ‌లా చూస్తోంది వ‌రూ. మొత్తానికి న‌ల్ల‌న‌య్య విశాల్‌ కి త‌గ్గ విల‌న్ దొరికింద‌నే వ‌రూని చూసి అనుకున్నారంతా. అదంతా స‌రే.. హైద‌రాబాద్ ప్ర‌మోష‌న్స్‌ లో విశాల్ - వ‌ర‌ల‌క్ష్మి స్నేహం గురించి - ల‌వ్ గురించి చాలానే ముచ్చ‌టా సాగింది. అస‌లింత‌కీ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏం జ‌రుగుతోంది? అంటే.. `పందెంకోడి 2` ప్ర‌మోష‌న్ లైవ్ ఆద్యంతం విశాల్ తీరు చూస్తే సందేహం క‌ల‌గ‌క మాన‌దు. అత‌డు వేదిక‌పై నుంచి వేదిక దిగువ‌న ఉన్న‌ వ‌రూనే చూస్తూ మాట్లాడాడు. ఆ టైమ్‌లో విశాల్ మాట్లాడుతున్నంతసేపూ అత‌డినే క‌ళ్ల‌లోకి క‌ళ్లు పెట్టి త‌థేకంగా చూస్తూ ఉండిపోయింది వ‌రల‌క్ష్మి. లైవ్ కార్య‌క్ర‌మం వేళ తెలుగు మీడియాలో  ఈ విష‌యంపై ఆస‌క్తిక‌రంగా గుస‌గుస‌లు వినిపించాయి. ముఖ్యంగా మీడియా ఐ బాల్స్ అన్నీ ఆ ఇద్ద‌రి వ్య‌వ‌హారం చుట్టూనే తిరిగాయి.

ఆ టైమ్‌ లో విశాల్ మాట్లాడుతూ- ``వ‌రూ క‌త్తి ప‌ట్ట‌డం ముందు నేనెంత‌.. ?  సినిమా చూసి థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక‌ వ‌ర‌ల‌క్ష్మి.. త‌ప్ప ఇంకెవ‌రూ క‌నిపించ‌రు. ఆ త‌ర్వాత కీర్తి గురించి.. చివ‌ర్లో నా గురించి మాట్లాడుకుంటారు`` అంటూ వ‌రూనే హైలైట్ చేశాడు.. ఆ టైమ్‌ లో వ‌రూ కిల‌కిలా న‌వ్వేస్తూ జోష్‌ తో క‌నిపించింది. ట్రైల‌ర్‌ లో రెండు క‌త్తులు ఒకేసారి దూస్తున్న వ‌రూ విల‌నీ సినిమాకే హైలైట్‌ గా ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక ఇలాంటి క్రేజీ సినిమాతో తెలుగు ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంద‌ని, ఇప్ప‌టివ‌ర‌కూ టాలీవుడ్‌ కి రాలేక‌పోయాన‌ని వ‌రూ వేదిక‌పై చెప్పింది. అది స‌రే... స్టిల్ బ్యాచిల‌ర్ విశాల్‌.. చిన్న‌నాటి స్నేహితురాలితో అస‌లేంటి క‌థ‌? అబ్బే... మేం ఫ్రెండ్సు మాత్ర‌మే అంటే కుద‌ర‌దిక‌!!
Tags:    

Similar News