తమిళ చలనచిత్ర పరిశ్రమకు చెందిన నడిగర్ సంఘానికి జరుగుతున్న ఎన్నికలు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రీల్ లైఫ్ లో వెండితెర మీద చెలరేగిపోయే హీరోలు.. రియల్ లైఫ్ లో పరిస్తితి ఎలా ఉంటుందో తాజా ఉదంతం తెలియజేస్తుంది. ఇక.. ఇరువురు హీరోలు (శరత్ కుమార్.. విశాల్) మధ్య మొదలైన ఎలక్షన్ వార్ తీవ్ర రూపం దాల్చింది.
చెన్నై మహానగరంలోని ఒక ప్రైవేటు స్కూల్లో పోలింగ్ జరుగుతోంది. పదేళ్లుగా నడిగర్ సంఘానికి నేతృత్వం వహిస్తున్న శరత్ కుమార్ జట్టు..తామే కొనసాగాలని భావించారు. అయితే.. దీనికి హీరో విశాల్ నో చెప్పి ఎన్నికల బరిలో నిలవటంతో ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల ప్రచారంలో ఇరువర్గాలు చేసుకున్న విమర్శలు.. ఆరోపణలతో ఈ ఎన్నిక ఇరు వర్గాలకు ప్రతిష్టాత్మకంగా మారింది.
తాజాగా పోలింగ్ జరుగుతున్న ప్రాంతంలో శరత్ కుమార్ వర్గీయులు హీరో విశాల్ పై దాడి చేశారు. ఇందులో ఆయన ఎడమ చేతికి గాయమైంది. ఆయన సన్నిహితులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఓటమి భయంతోనే ఈ దాడి చేసిన్టట్లుగా విశాల్ వర్గానికి చెందిన వారు ఆరోపిస్తున్నారు. తాజా దాడితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఎన్నికల ఫలితం ఆదివారం సాయంత్రం వెలువడనుంది.