సంక్రాంతికి తెలుగులో లాగే తమిళంలోనూ రసవత్తర పోటీ నెలకొంది ఈసారి. నాలుగు పేరున్న సినిమాలు పోటీ పడితే.. అందులో విశాల్ సినిమా ‘కథకళి’ విన్నర్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి కూడా అనువదించారు. సంక్రాంతికే ఇక్కడా రిలీజ్ చేయాలని చూశారు కానీ.. థియేటర్లు దొరక్కపోవడంతో కుదర్లేదు. దీంతో వారం లేటుగా 22న ‘కథకళి’ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ‘కథకళి’ ప్రమోషన్ కోసం హైదరాబాద్ కు వచ్చిన హీరో విశాల్.. ఈ సినిమా కచ్చితంగా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని.. ఇది ఎడ్జ్ ఆఫ్ ద సీట్ తరహా థ్రిల్లర్ కథాంశమని చెప్పాడు.
‘‘కథకళి అనే పేరు పెట్టాం కాబట్టి ఇదేదో నృత్య సంబంధమైన సినిమా అనుకోవద్దు. ఇది ఓ మిస్టరీ గేమ్. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగుతుంది. విలన్ జాడ తెలుసుకోవడానికి హీరో చేసే ప్రయత్నం ఉత్కంఠ రేపుతుంది. ద్వితీయార్ధంలోని సస్పెన్స్, థ్రిల్ ప్రేక్షకుల్ని సరికొత్త అనుభూతికి గురి చేస్తుంది. దాదాపు 50 నిమిషాల కథనం కట్టి పడేస్తుంది. స్క్రీన్ ప్లేలో ఫ్లో దెబ్బ తినకూడదని.. ప్రేక్షకులు డీవియేట్ కాకూడదని.. ఆ యాభై నిమిషాలు పాటే పెట్టలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంటుంది. తమిళంలో ‘కథకళి’ గ్రాండ్ సక్సెస్ అయింది. సంక్రాంతి సినిమాల్లో నెంబర్ వన్ అనిపించుకుంది. తెలుగు ప్రేక్షకులు కూడా అదే తరహాలో ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అని విశాల్ చెప్పాడు. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విశాలే స్వయంగా నిర్మించడం విశేషం. కేథరిన్ త్రెసా హీరోయిన్ గా నటించింది.