తమిళనాడు రాజకీయాలకు - సినిమా రంగానికి విడదీయలేని బంధం ఉందనే విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో సినిమాలు రాజకీయాల చుట్టూ తిరడగం - రాజకీయాలు సినిమా వాళ్ల చుట్టూ తిరగడం పరిపాటే. తమిళ చిత్రపరిశ్రమలో ఉన్న ఈ ట్రెండ్ నేపథ్యంలో ఇప్పటికే ప్రముఖ స్టార్ హీరోలు రజనీకాంత్ - కమల్ హాసన్ రాజకీయ రంగప్రవేశం గురించి పెద్ద చర్చే జరుగుతోంది. విలక్షణ నటుడు కమలహాసన్ తమిళనాడు రాజకీయాల్లో అడుగు పెట్టడానికి రంగం సిద్ధమైనట్లు ఖరారైంది కూడా!
ఇలా ఇద్దరు ప్రముఖ నటులు తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో మరో యువ హీరో తాను సైతం అని ప్రకటించారు. తాజాగా హీరో విశాల్ రాజకీయాల్లో నా ఎంట్రీ షూరూ అంటున్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ప్రజలకు మేలు చేసేందుకు ఈ ప్రయత్నం చేయనున్నట్లు ప్రకటించారు. తమిళ ప్రజలకు ఉత్తమమైన ప్రజా సేవకుడిగా ఉండాలనేది తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఇప్పటికే గట్టి పోటీ మధ్య దక్షిణభారత నటినటుల సంఘం ఎన్నికల్లోనూ, తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లోనూ గెలిచి విశాల్ సంచలనం సృష్టించారు.
కాగా, గతంలో ఢిల్లీలో ఆందోళన చేస్తున్న తమిళనాడు రైతులకు హస్తినకు వెళ్లి సైతం విశాల్ మద్దతు ఇచ్చారు. దీంతోపాటుగా నడిగర్ సంఘంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలని పరిష్కరించారు. కొద్దికాలం క్రితం కర్ణాటక వెళ్లి, అక్కడ మాట్లాడేందుకు సాహసించని కావేరీ వివాదంపై నిర్భయంగా మాట్లాడాడు. బెంగళూరు జరిగిన ఓ ఆడియో ఫంక్షన్ కు హాజరైన విశాల్ ఈ సందర్భంగా పూర్తిగా తమిళంలోనే మాట్లాడుతూ వివాదాస్పదమైన కావేరీ జలాలపై స్పందించారు. ``ఈ దేశంలో ఉన్న మనమంతా భారతీయులం. పరస్పరం అభిప్రాయాలు పంచుకోవాలి. నీళ్లు అడగడం మా హక్కు. దాన్ని ఎవరూ కాదనలేరు. తమిళంలో మాట్లాడటానికి నేను గర్విస్తున్నాను. అలా మాట్లాడకుండా నన్నెవరూ ఆపలేరు కూడా. అందుకే నేను తమిళ ప్రజల తరఫున నీటి ఆకాంక్షను చాటుతున్నాను. కన్నడ గడ్డపై ఉన్న తమిళ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడి వారికి ఉంది` అని స్పష్టం చేశారు. తమిళ నిర్మాత మండలి అధ్యక్షుడు, నడిగర సంఘం కార్యదర్శి కూడా అయిన విశాల్ సినీ పరిశ్రమ గురించి ప్రస్తావిస్తూ కన్నడ నిర్మాతలు సినిమా తీసేందుకు తమిళనాడు వస్తే వారికి అవసరమైన అన్ని సహాయసహకారాలు తాము అందిస్తామని ప్రకటించారు. తమిళరాష్ట్రంలో ఉన్న కన్నడ ప్రజల భధ్రతను కాపాడాల్సిన బాధ్యత తమిళులదేనని తెలిపారు. ఇరు రాష్ర్టాల ప్రజలు పరస్పరం గౌరవించుకోవడం ద్వారా సంబంధాలు పెంచుకోవాలని కోరారు. తమ సమస్యలను సైతం సామరస్యపూర్వక దోరణిలో పరిష్కరించుకోవాలని చెప్పారు.