పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి ఎన్ని ఆదర్శ భావాలున్నాయో అన్ని ఆదర్శాలున్నాయి నల్లనయ్య విశాల్ లో. అందుకే కోలీవుడ్ లో అతడి కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అతడు రెబల్‌లకు రెబల్. శత్రువు గుండెల్లో గుబులు పుట్టిస్తాడు. మంచి వాళ్లకు మంచివాడు. నచ్చినవారికి వెన్న పూస్తాడు. నెయ్యి పప్పన్నం వడ్డిస్తాడు. కోలీవుడ్ లో ఓ వైపు నడిగర సంఘం ఎన్నికలకు సంబంధించి బోలెడంత హడావుడి సాగుతోంది. అధికారపక్షం శరత్ కుమార్ కి వ్యతిరేకంగా విశాల్ పోటీ బరిలో నిలిచాడు. మామా! నిన్ను కదిలిస్తా, నీ అక్రమాల్ని వెలుగులోకి తెస్తా అంటూ పోరాడుతున్నాడు. అణగారిన వారికి అండగా నిలుస్తున్నాడు.
సేమ్ టైమ్ శ్రీలంక నుంచి తరలివచ్చిన కాందిశీకుల (వలసదారులు) కోసం బోలెడన్ని సేవలు చేస్తున్నాడు. అతడి పిలుపు మేరకు అభిమానులు స్వచ్ఛందంగా వచ్చి అన్నార్తులను ఆదుకుంటున్నారు. చదువుకునే పేదబాలలకు పుస్తకాలు పంచారు. గుడులు గోపురాల్లో ప్రసాదాల పంపిణీ చేశారు. అందుకోసం విశాల్ ఏకంగా పాండిరాజ్ తో షూటింగ్ వదులుకుని మరీ వచ్చాడు. కొందరు శవాల మీద కాసులు ఏరుకున్నట్టు... కష్టాల్లో తరలివచ్చిన కాందిశీకులను రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నారు. కానీ ఓ నటుడిగా నేను ఆ పనిచేయను. నటుడు అంటే రంజింపజేయడమే లక్ష్యం. అవసరంలో ఉన్నవారికి ఆదుకునే మంచి మనసు ఉండాలి... అంటూ విశాల్ రియల్ హీరో అనిపించాడు. ఓ రకంగా అతడు చేస్తున్న పని పవనిజం లాంటిదేనని అభిమానులు అంటున్నారు. అదీ సంగతి.