బిల్డింగ్ లో మొదటి పెళ్లి విశాల్ దే

Update: 2016-05-12 13:15 GMT
పందెంకోడి మూవీతో తెలుగులో కూడా మాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు తమిళ హీరో విశాల్. తెలుగు కుర్రాడే అయినా తమిళనాట స్టార్ హీరోగా అవతరించిన విశాల్.. ఇప్పుడు రాయుడు అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మే 20న తమిళ్ 'మరుదు' విడుదల కానుండగా.. తెలుగు వెర్షన్ 'రాయుడు' మే 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో ఓ వారం లేట్ గా రావడానికి కారణం.. తనకు తమిళ్ మెయిన్ అని, తెలుగు బోనస్ లాంటిదని చెబుతున్నాడు విశాల్.

ఇప్పటికే రాయుడుకు సంబంధించిన ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసిన విశాల్.. ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరయ్యాడు. ఓ బామ్మ - మనవడు మధ్య నడిచే స్టోరీనే ఈ రాయుడు అని విశాల్ చెబుతున్నాడు. ఈ మూవీకి హీరో - హీరోయిన్ అన్నీ బామ్మ పాత్రే  అన్నాడు ఈ పందెం కోడి. పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్ తో నడిచే ఈ సినిమాలో.. గడ్డం - టాటూతో డిఫరెంట్ లుక్ తో కనిపిస్తానని, ఫైట్లు చాలా స్పెషల్ గా ఉంటాయని అంటున్నాడు.

నడిగర్ సంఘం ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత విశాల్ జోరు బాగానే పెరిగింది. నష్టాల్లో ఉన్న సంస్థను ఇప్పుడు 9కోట్ల లాభాల్లోకి తేవడమే కాదు.. సొంత బిల్డింగ్ కూడా కట్టేస్తున్నాడు. ఈ నడిగర్ సంఘం బిల్డింగ్ ను జనవరి 14 - 2018న ప్రారంభించేందుకు ముహూర్తం పెట్టిన విశాల్.. ఆ మరుసటి రోజే తన పెళ్లి అని అనౌన్స్ చేసేశాడు. పెళ్లి కూతురు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి అని చెప్పకపోయినా.. అందరికీ తెలిసిన విషయమే.
Tags:    

Similar News