తమిళనాట సినిమా పరిశ్రమ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. జయలలిత మరణం తర్వాత పలువురు స్టార్లు రాజకీయాలపై దృష్టిసారించారు. తాజాగా విజయ్ - విశాల్ లాంటి యువ కథానాయకులు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రచారం సాగుతోంది. అయితే పాలిటిక్స్ పై కన్నేసినవాళ్లలో ఎవరిని కదిలించినా... సిస్టమ్ ని చక్కదిద్దాలనుకొంటున్నామని, సేవ చేయాలనుకొంటున్నామని చెప్పేవాళ్లే ఎక్కువ. కానీ విశాల్ మాత్రం అందుకు డిఫరెంట్ గా సమాధానమిస్తున్నాడు.
మీరు కూడా పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయ్యారట కదా అని అడిగితే... చేతిలో అధికారం ఉంటేనే సేవ చేయగలననుకొంటే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తానని, అలాగే ప్రతి ఎమ్మెల్యేకి నెలకి ఇస్తున్న 2 లక్షల జీతంతో నా జీవితం గడపగలను అనుకొంటే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తానని చెప్పుకొచ్చాడు విశాల్. ఆ మాటలు విశాల్ లోని నిజాయతీకి అద్దం పట్టేలా ఉన్నాయి. పలువురిని ఆలోచనలో పడేసేలా ఉన్నాయి. డబ్బు కోసమే రాజకీయాల్లోకి వెళ్లకూడదని - సేవే పరమార్థం కావాలని ఆయన మాటలు చెప్పకనే చెబుతున్నాయి. తమిళనాట నడిగర్ సంఘం నాయకుడిగా ఉంటూనే పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు విశాల్. వరదల సమయంలో రాజకీయంగా పదవులేవీ లేకపోయినా వాళ్లని మించిన స్థాయిలో చెన్నైలో ప్రజలకి అండగా నిలిచాడు. విశాల్ ఆలోచనలు - ఆయన మాటలు మాత్రం యువతరానికి స్ఫూర్తినిచ్చేలా ఉన్నాయి.