'పందెంకోడి' కి లైనేసిన చ‌ర‌ణ్‌ - తార‌క్‌

Update: 2018-09-29 10:58 GMT
విశాల్ క‌థానాయ‌కుడిగా లింగుస్వామి తెర‌కెక్కించిన పందెంకోడి సంచల‌నాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నేలేదు. విశాల్ - లింగు జీవితాల్ని మార్చేసిన బ్లాక్‌ బ‌స్ట‌ర్ చిత్ర‌మిది. 13 ఏళ్ల క్రితం విశాల్‌ ని లాంచ్ చేస్తూ లింగుస్వామి చేసిన అసాధార‌ణ ప్రయత్నం  ఇదీ. అయితే ఈ సినిమా విశాల్ చేయ‌క‌పోతే ఎవ‌రు చేసేవారు? అంటే అందుకు విశాల్ నోటి నుంచి వ‌చ్చిన సమాధానం.. రామ్ చ‌ర‌ణ్ లేదా ఎన్టీఆర్ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు చేసి ఉండేవార‌ని ప‌రోక్షంగా చెప్పారు.

అస‌లు ఇలాంటి స్క్రిప్టు మ‌రొక‌టి దొర‌క‌దు.. నా కొడుకుని హీరోగా ప‌రిచ‌యం చేయ‌డానికి అని మా నాన్న‌గారు ప‌ట్టుబ‌ట్టి ఉండ‌క‌పోతే - అన్న‌య్య విక్ర‌మ్ కృష్ణ ప్ర‌య‌త్నించ‌క‌పోయి ఉంటే ఈరోజు నేను ఇలా ఉండే వాడిని కాదు. అందుకే నా జీవితం నాన్న‌కే అంకితం అని విశాల్ నేడు పందెంకోడి 2 ప్ర‌చార వేదిక‌పై అన్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు. అప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్‌ - ఎన్టీఆర్ - హ‌రికృష్ణ ఈ స్క్రిప్టు త‌మ‌కు కావాల‌ని వెంట‌ప‌డి తిరుగుతున్నారు. అయినా నాన్న స‌సేమిరా అన్నారు. ఎన్ని కోట్లు ఇచ్చినా ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని అన్నారు.. అంటూ విశాల్ తెలిపాడు.

13 ఏళ్ల త‌ర్వాత పందెంకోడి 2 చిత్రంతో నా కెరీర్ 25వ సినిమాలో న‌టించ‌గ‌లుగుతున్నాను అంటే అది నాన్న వ‌ల్ల‌నే అని తెలిపారు. ఈ చిత్రం త‌న‌కు నెక్ట్స్ లెవ‌ల్ చిత్రం అవుతుంద‌ని అన్నారు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అంద‌రికీ న‌చ్చుతుంద‌ని, లింగుస్వామితో స్నేహం ఈ స్థాయిని ఇచ్చింద‌ని విశాల్ వెల్ల‌డించారు.


Tags:    

Similar News