ప్రస్తుత రోజుల్లో హీరోలు నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తే ప్రేక్షకుకులు చూడటానికి చాలా ఇష్టపడుతున్నారు. నెగిటివ్ అనే పదం ఒకప్పుడు హీరోలకి సెట్ అయ్యేది కాదు. ఇప్పటికి కూడా నెగిటివ్ అంటే సెట్ కాదు బట్ హీరోకి విలన్ కి మధ్య ఉండే ఒక సన్నని క్యారెక్టర్ కరెక్ట్ గా ప్రెజంట్ చేస్తే కత్తిలా ఉంటుంది. మాస్ ఆడియెన్స్ అలాంటి పాత్రలను ఏ స్థాయిలో ఇష్టపడతారో తెలిసిందే.
అయితే ఇప్పుడు అలాంటి రోల్స్ వస్తే చేయడానికి సిద్ధం అంటున్నారు సౌత్ హీరోలు. నెగిటివ్ పాత్రలు సినిమాకి హైలెట్ గా ఉంటాయని అనిపిస్తే తప్పకుండా చేస్తామని అంటున్నారు. ముఖ్యంగా తమిళ్ హీరోలు ఇక్కడ హీరోలుగా బాగానే సక్సెస్ అవుతున్నారు. దీంతో ప్రేక్షకుల మన్ననలను మరింత అందుకోవడానికి నెగిటివ్ లో వచ్చి పాజిటివ్ గా ప్రేక్షకుల అభిమానాన్ని పొందాలని చూస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్- వరుడు సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆర్య మంచి మార్కులే కొట్టేశాడు. సరైనోడు లో ఆది పీనిశెట్టి కూడా విలన్ గా మంచి సక్సెస్ ని అందుకున్నాడు. రీసెంట్ గా స్పైడర్ సినిమాలో ప్రేమిస్తే భరత్ కూడా విలన్ గా కనిపించాడు. అయితే ఇప్పుడు అదే తరహాలో రెగ్యులర్ కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ కూడా విలన్ రోల్స్ చేయడానికి రెడీ అంటున్నాడు.
ఈ హీరో సినిమాలు తమిళ్ లో తెరకెక్కిస్తే ప్రతి సినిమాని తెలుగులో కూడా డబ్ చేస్తాడు. విశాల్ సినిమాలకి టాలీవుడ్ లో మంచి బిజినెస్ ఉంది. కానీ మొదట్లో అందుకుంటున్న హిట్స్ ఇప్పుడు అందుకోవడం లేదు. దీంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వాలని నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ తెలుగులో వస్తే తప్పకుండా చేస్తాను అని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇటీవల ఈ హీరో నటించిన డిటెక్టివ్ సినిమా తమిళ్ లో రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకొంది. ఇక తెలుగులో ఆ సినిమాని ఈ నెల 10న రిలీజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడు.